జోవిక( Jovica ) ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు చాలా ఫేమస్ గా మారిపోయింది.జొవిక అంటే మన వాళ్లకు తెలియకపోవచ్చు.
ఆమె పూర్తి పేరు జోవికా విజయ్ కుమార్.కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి వనిత విజయ్ కుమార్( Vanitha Vijay Kumar ) కుమార్తె ఈ జోవిక.
ఇప్పుడు మీకు విషయం అర్థమై ఉంటుంది.గతంలో వనిత విజయ్ కుమార్ బిగ్ బాస్ తర్వాత మంచి ఫేమ్ దక్కించుకున్నారు.
ప్రస్తుతం 18 ఏళ్ల వయసులో ఉన్న జోవిక సైతం తల్లి బాటలోనే నడుస్తూ బిగ్ బాస్ లో తన అడుగు పెట్టింది.ఆమె ఎంట్రీ గురించి గతంలోనే మనం మాట్లాడుకున్నాం.
కానీ ప్రస్తుతం ఆమె ఆడుతున్న విధానం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.అందుకే మరో మారు మనం జోవిక గురించి ప్రస్తావించుకోవాల్సి వస్తుంది.
నిజానికి జోవిక తల్లి, తాత, అమ్మమ్మ, పిన్నమ్మలు, మామయ్య అందరూ కూడా గొప్ప నటీనటులు.ఆమె స్థానంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఉండి ఉంటే ఖచ్చితంగా ఒక రేంజ్ స్టార్ డాం చూస్తూ ఉండేది.కానీ జోవిక పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం.ఎందుకంటే ఆమె తన చిన్న వయసులోనే ఇంట్లో నుంచి గెంటివేయబడింది.తన తల్లితో పాటు ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే ఒంటరిగా తల్లిని చూస్తూ పెరిగింది.ప్రతిరోజు కష్టాలే అనుభవించింది… నిజానికి వేల కోట్ల ఆస్తులు ఆమె కలిగి ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా జోవిక ఆమె తల్లి వనిత అలాగే ఒక చెల్లితో చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.
వారి కష్టార్జితంతోనే వారు బ్రతుకుతున్నారు.
జోవిక బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) లోకి అడుగు పెట్టగానే అందరూ స్టార్ కిడ్ కాబట్టి బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి తీసుకున్నారు అనుకున్నారు కానీ ఆమె ఆడుతున్న విధానం చూసి చాలామంది ముచ్చట పడుతున్నారు.18 ఏళ్ళ వయసులో ఆమె బ్యాలెన్స్, మెచ్యూరిటీ లెవెల్స్ మామూలుగా లేవు.ప్రతి మాటలో తన కుటుంబం గురించి ఎవరు మాట్లాడద్దు అని చెప్పే విషయ విధానంలో ఆమె కచ్చిత మనస్తత్వం అర్థం అవుతుంది.
తనకు కుటుంబం అంటే చాలా పెద్ద విషయం అనేది ప్రతిసారి అందరికీ చెప్పేలా చేస్తుంది.తన తల్లి కోల్పోయిన గౌరవాన్ని తిరిగి అందేలా చేస్తోంది.మంచి సానుభూతి కూడా దొరుకుతుంది అలాగే తన తల్లి పట్ల జనాల్లో ఇప్పటి వరకు ఉన్న నెగెటివిటీ కూడా దూరం అవుతోంది.ఇది నిజంగా అందరూ సంతోషించాల్సిన సమయం.
తల్లి కూతుర్లు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.మొత్తానికి విజయ్ కుమార్ కూడా వీరిని స్వీకరిస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు.