నేను ఇలాగే ఉంటాను.. ఎవరు ఏమైనా అనుకోండి.. నా తీరు ఇంతే

నేనింతే… నేను ఇలాగే ఉంటాను ….నేను ఎవ్వరి మాట వినను … నాకు నచ్చింది చేస్తాను.

 Untold Facts About Heroine Nayanathara,nayanthara, Lady Amitabachchan ,surrogacy-TeluguStop.com

ఇవి నయనతార కి సరిగ్గా సరిపోయే మాటలు.ఆమె ఒక లేడీ అమితాబచ్చన్.

.సౌత్ ఇండియా సూపర్ స్టార్.

ఇలా ఎంతో ఎదిగినా కూడా నయనతార జీవితంలో అంతులేని వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి ఉన్నాయి.ప్రేమ వివాదాలు, పెళ్లి వివాదాలు, పిల్లల వివాదాలు.

ఆమె చేయని పని లేదు, మీడియాకు దొరక్కుండా ఉన్నది లేదు.నయన్ ఏం చేసినా మీడియాకు ఒక వార్త అవుతుంది.

ఏం చేయకపోయినా అది పెద్ద వార్త.మూడుకు పైగా ప్రేమకథలు, అంతే స్థాయిలో బ్రేకప్ లు .చివరిగా సహజీవనం… ప్రస్తుతం సరోగసి వివాదం… ఇది క్లుప్తంగా నయనతార జీవితం.

Telugu Nayan, Nayanthara, Nayantharas, Prabu Deva, Simbu, Vignesh-Telugu Stop Ex

ప్రేమ లో పడటం వంటి విషయాల్లో మీడియా ఎప్పుడు నయన తారని కార్నర్ చేస్తూనే వచ్చింది.కానీ నిజానికి ఇక్కడ ఆమె మోసపోయింది అనే విషయాన్ని మాత్రం అందరు మర్చిపోయారు.మొదటగా అమ్మాయిల రాకుమారుడు అయినా శింబు తో ప్రేమలో పడిన నయనతార ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంది.

కానీ శింబు మనస్తత్వం అర్థం కావడంతో దూరం జరిగింది.ఇక ఆ బ్రేకప్ తర్వాత కొన్నాళ్లపాటు డిప్రెషన్ లోకి కూడా వెళ్ళింది.తర్వాత ప్రభు దేవా కోసం ఏకంగా మతం కూడా మార్చుకుంది.కొన్నేళ్ల పాటు సహజీవనం కూడా చేసింది.

కానీ ప్రభుదేవా చేసిన మోసం కారణంగా మళ్ళీ ప్రేమలోకి పడడానికి భయపడింది.చివరగా విగ్నేష్ తో ప్రేమలో పడింది.

ఐదేళ్లపాటు సహజీవనం చేసింది.ఇక ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయింది

Telugu Nayan, Nayanthara, Nayantharas, Prabu Deva, Simbu, Vignesh-Telugu Stop Ex

అంతా బాగానే ఉంది అనుకున్న తరుణంలో మరోమారు సరోగసి గొడవ.

Telugu Nayan, Nayanthara, Nayantharas, Prabu Deva, Simbu, Vignesh-Telugu Stop Ex

వాస్తవానికి నయన్ తాను అనుకున్నది చేసి తీరుతుంది.ఎవ్వరికీ సమాధానాలు చెప్పదు, మీడియా తీరును ప్రశ్నించదు, చివరికి తాను తీసే సినిమాకి తానే ప్రమోషన్స్ కి కూడా రాదు, ఇంటర్వ్యూస్ ఇవ్వదు, ఆమెకు నచ్చినట్టుగా జీవితాన్ని గడపడం నయన్ స్పెషాలిటీ.సోషల్ మీడియా అంతా కూడా నయన్ గురించి వస్తున్న ఈ సమయంలో ఆమె ఎక్కడో ప్రశాంతంగా తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.చివరికి ప్రభుత్వం కూడా సరోగసి ఎందుకు చేయించుకున్నారో తెలుసుకోవడానికి నోటీసులు పంపిన నయన్ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube