స్మోకింగ్.నేటి కాలంలో చాలా మందికి ఉన్న అలవాటు.పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా.పట్టించుకునే వారే కరువయ్యారు.చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ దీనికి బానిసలౌతున్నారు.ఫాస్ట్ కల్చర్ ఎక్కువగా ఉన్న చోట్ల ఆడవారు కూడా స్మోకింగ్‌కు అలవాటు పడుతున్నారు.
అయితే కొందరు ఫ్యాషన్‌గా స్మోకింగ్ చేస్తుంటే.మరికొందరు రిఫ్రెష్ అయ్యేందుకు స్మోక్ చేస్తుంటారు.
కారణం ఏదైనప్పటికీ స్మోకింగ్ చేయడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం కొన్ని మిలియన్ల మంది ధూమపానం కారణంగా మృతి చెందు తున్నారు.
సిగరెట్లలో ఉండే నికోటిన్ అనే పదార్థం.రక్తంలో విడుదలై ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుంది.
దాంతో ఆయా అవయవాలు మెల్లగా దెబ్బ తినడం ప్రారంభమై.చివరకు ప్రాణాలే పోయే పరిస్థితి వస్తుంది.
అందుకే స్మోకింగ్ అలవాటును మానుకోవాలని నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతారు.
అయితే స్మోకింగ్ అలవాటును దూరం చేయడంలో యాలకులు అద్భుతంగా సహాయ పడతాయి.బిర్యానీల్లో, స్వీట్లలో విరి విరిగా యాలకులను ఉపయోగిస్తుంటారు.చూడటానికి యాలకులు చిన్నగా కనిపించినా.
వాటికి ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి.అవి ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.
ముఖ్యంగా స్మోకింగ్ అలవాటును మానుకోవాలి అని భావించే వారికి యాలకులు గ్రేట్‌గా ఉపయోగపడతాయి.
అవును, స్మోకింగ్ చేయాలి అనే భావన కలిగినప్పుడు ఒకటి లేదా రెండు యాలకులను బాగా నమిలి మింగేయాలి.
ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల.యాలకుల్లో ఉండే పలు కాంపౌండ్స్ సిగరెట్స్‌పై ఇంట్రెస్ట్ తగ్గించేస్తుంది.
కేవలం సిగరెట్స్‌పైనే కాదు.మద్యపానంపైన కూడా అసక్తి తగ్గించగలిగే శక్తి యాలకులకు ఉంది.
ఇక ప్రతి రోజు ఒకటి, రెండు యాలకులు తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా ఆరోగ్యానికి కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్‌ను చేకూరుస్తాయి.