ప్రస్తుత వింటర్ సీజన్ లో చర్మ సమస్యలే కాదు జుట్టు సమస్యలు కూడా బాగా ఇబ్బంది పెడుతుంటాయి.చలి, పొడి గాలి జుట్టును డీహైడ్రేట్(Cold, dry air dehydrates the hair) చేస్తాయి.
ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది.మనలో చాలా మంది వింటర్ రాగానే హెయిర్ ఫాల్ మరింత ఎక్కువైందని అంటుంటారు.
మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే చింతించాల్సిన అవసరం లేదు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హెయిర్ మాస్క్(Hair mask) ను కనుక ప్రయత్నిస్తే చాలా సులభంగా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు.
మాస్క్ తయారీ కోసం ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కలబంద (Aloe vera)ముక్కలు, రెండు మందారం ఆకులు(Hibiscus leaves), పావు కప్పు బియ్యం నానబెట్టిన వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్(Henna powder) వేసి బాగా మిక్స్ చేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ విధంగా హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల చలికాలంలో జుట్టు రాలే సమస్య తగ్గు ముఖం పడుతుంది.హెయిర్ హైడ్రేట్ గా మరియు హెల్తీ గా మారుతుంది.
ఈ హెన్నా మాస్క్ లోని యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు రాలడం మరియు చుండ్రు ను తగ్గించడంలో సహాయపడతాయి.

అలాగే ఈ హెన్నా మాస్క్ లో విటమిన్ ఇ ఉంటుంది, ఇది జుట్టును మృదువుగా చేస్తుంది మరియు జుట్టు ఆరోగ్యానికి తోడ్పడే ప్రోటీన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది.అంతేకాకుండా ఆ మాస్క్ స్కాల్ప్ నుండి మురికి, మృతకణాలను తొలగిస్తుంది.జుట్టు పెరుగుదలను సైతం ప్రోత్సహిస్తుంది.







