చుండ్రు( dandruff ).చాలా మంది ఫేస్ చేసే కామన్ సమస్య ఇది.
తల చర్మం పొడిబారిపోవడం, ఫంగల్ ఇన్‌ఫెక్షన్, తల చర్మంలో ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి కావడం, రెగ్యులర్ గా తలస్నానం చేయడం లేదా అస్సలు చేయకపోవడం, శరీరంలో హార్మోన్ సమతుల్యత, కెమికల్ షాంపూల వాడకం, కాలుష్యం, పోషకాల కొరత తదితర కారణాల వల్ల చుండ్రు సమస్య ఏర్పడుతుంది.ఈ క్రమంలోనే చుండ్రును వదిలించుకోవడం కోసం నానా తిప్పలు పడుతుంటారు.
అయితే సంపూర్ణంగా చుండ్రును తగ్గించే హోమ్ రెమెడీ కొన్ని ఉన్నాయి.మరి లేటెందుకు వాటిపై ఓ లుక్కేసేయండి.

రెమెడీ 1: ముందుగా ఒక కలబంద ఆకును( Aloe vera leaf )తీసుకుని వాటితో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో చేతినిండా తులసి ఆకులు( Basil leaves ) మరియు ఫ్రెష్ అలోవెరా జెల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఈ విధంగా చేశారంటే చుండ్రు సమస్య దెబ్బకు పరార్ అవుతుంది.
తులసి యాంటీ ఫంగల్ గుణాలు( Antifungal properties )కలిగి ఉండటం వల్ల చుండ్రును తగ్గిస్తుంది.మరియు అలోవెరా జెల్ తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

రెమెడీ 2: ఆలివ్ ఆయిల్ మరియు లెమన్ జ్యూస్ ( Lemon juice )కాంబినేషన్ కూడా చుండ్రు చికిత్సలో అద్భుతంగా సహాయపడుతుంది.ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ మరియు వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి సున్నితంగా మర్దన చేసుకోవాలి.అరగంట తర్వాత మైల్డ్ షాంపును ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది.స్కాల్ప్ హెల్తీగా మారుతుంది.