సలాడ్స్( Salads ).ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఆహార పదార్థాల్లో ఒకటి.
సలాడ్స్ అనేవి వివిధ రకాలుగా ఉంటాయి.కూరగాయల సలాడ్, స్ప్రౌట్ సలాడ్, ఫ్రూట్ సలాడ్స్, నట్స్ అండ్ సీడ్స్ సలాడ్, గ్రేన్ బేస్డ్ సలాడ్స్, సీజర్ సలాడ్, చికెన్ సలాడ్.
ఇలా ఎన్నో రకాలు ఉంటాయి.దాదాపు అన్ని ఆరోగ్యకరమైనవే.
సలాడ్స్ లో పోషకాహారం సమృద్ధిగా ఉంటాయి.తేలికగా జీర్ణమవుతాయి.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.రెగ్యులర్ డైట్ లో సలాడ్స్ ను చేర్చుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య లాభాలు ఉన్నాయి.

ప్రధానంగా బరువు నియంత్రణకు సలాడ్స్ బెస్ట్ ఛాయిస్ అవుతాయి.సలాడ్స్ లో క్యాలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. ఫైబర్ మరియు ప్రోటీన్ ( Fiber and protein )అధికంగా ఉంటాయి.సలాడ్స్ అతి ఆకలిని, అతిగా తినడాన్ని తగ్గిస్తాయి.శరీర బరువును అదుపులోకి తెస్తాయి.పండ్లతో తయారు చేసిన సలాడ్స్ మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
చర్మం కాంతిని మరియు మెరుపును నిలుపుకోవడంలో తోడ్పడతాయి.కూరగాయల సలాడ్స్ లో కాల్షియం, ఐరన్ మరియు పొటాషియం( Calcium, iron and potassium ) వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి, ఇవి ఎముకల ఆరోగ్యం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి మరియు గుండె పనితీరుకు సహాయపడతాయి.

క్యారెట్, బీట్‌రూట్, మొలకలు, కీరా ( Carrots, beetroot, sprouts )వంటి పదార్థాలతో తయారు చేసే సలాడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తాయి.అలాగే సలాడ్స్ ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మెమొరీ పవర్ పెరుగుతుంది.మానసిక ఒత్తిడి తగ్గుతుంది.శరీరానికి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.
జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగపడుతుంది.ఫైనల్ గా చెప్పేది ఏంటంటే.
సలాడ్స్ రుచికరంగానే కాకుండా ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి.కాబట్టి, వీలైనంత వరకు రోజుకు ఒకసారి సలాడ్ తీసుకోండి.
లేదంటే వారానికి ఒక్కసారైనా సలాడ్స్ తినండి బాస్!
.






