సాధారణంగా మనం ప్రతి రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు జేబులో పర్సు పెట్టుకుంటూ ఉంటాము.కానీ అందులో ఏముంటాయి, ఎలా ఉంచుకోవాలని దాని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు.
దీంతో మనకు నష్టాలు కూడా రావచ్చు.ఇంకా చెప్పాలంటే పర్సు( Wallet ) ను ఎప్పుడు కూడా చిందరవందరగా ఉంచుకోకూడదు.
ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నామో పర్సు కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి.

ముఖ్యంగా చెప్పాలంటే పర్సులో పనికి రాని వస్తువులు ఉంచుకుంటే ఇబ్బందులు వస్తాయి.అలాగే పర్సులో ఇతర కాగితాలు ఉంచుకోకూడదు.కొందరు ఏ బిల్లు పడితే ఆ బిల్లు పర్సులో ఉంచుకుంటూ ఉంటారు.
అలాగే పర్సులో ఇవన్నీ పెట్టుకుంటే మనకు ఆర్థిక నష్టం కలుగుతుంది.ఇంకా చెప్పాలంటే పర్సు ఎప్పుడు ఖాళీగా( Empty Wallet )ఉంచకూడదు.
పర్సులో కనీసం 10 రూపాయల నోటైనా ఉంచుకోవాలి.
ఇలా పర్సు విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
లేదంటే మనకు కచ్చితంగా నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.పర్సులో ఎప్పుడూ కూడా దేవుళ్ళ చిత్రాలు( God Photos ) ఉండకూడదు.
మనుషులు బతికున్న వారు అయినా చనిపోయిన వారు అయినా వారి చిత్రాలు ఉంచుకోవడం శ్రేయస్కరం కాదు.ఇలా ఉంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
పర్సులో కేవలం డబ్బులు మాత్రమే ఉంచుకోవాలి.ఇతర వస్తువులు ఉంచుకుంటే ఆర్థికంగా చాలా నష్టాలు వచ్చే అవకాశం ఉంది.

ఇంకా చెప్పాలంటే పర్సులో డబ్బులు( Money ) కూడా ఎలా పడితే అలా పెట్టుకోకూడదు.డబ్బులు చిందరవందరగా పెట్టుకుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.అందుకే డబ్బులు ఎప్పుడు కూడా సరిగ్గా సర్దుకొని పర్సులో ఉంచుకోవాలి.పర్సులో క్రమాపద్ధతిలో పెట్టుకోకపోతే ఇబ్బందులు తప్పవు.దీంతో చక్కగా ఉంచుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.