మన భారత దేశంలో ఎన్నో రకాల ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి.అలాగే చాలామంది ప్రజలు చనిపోయిన తమ పూర్వీకులకు శ్రద్ధ కర్మలు నిర్వహిస్తూ ఉంటారు.
కొంతమంది ఈ కార్యాలను చేయకపోవడం వల్ల వారికి పితృ దోషాలు, పితృ శాపాలు వెంటాడుతూ ఉంటాయి.ముఖ్యంగా చెప్పాలంటే పితృ దోషాలు( Pitru Doshalu ), పితృ శాపాలు ఉన్నవారు కూడా కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటారు.
ఉత్తరాయణం శుభకార్యాలకు, దక్షిణ యానం పితృ కార్యాలు ఆచరించడానికి శ్రేష్టమని పండితులు చెబుతున్నారు.సమాజంలో ఉన్న ప్రతి మనిషి గతించినటువంటి పితృ దేవతలకు తర్పణాలు, పిండప్రదానాలు, శ్రాద్ధ కర్మలు వంటివి కచ్చితంగా నిర్వహించాలి.

అలా వారు నిర్వహించలేక పోతే వారికి పితృ దోషాలు, పితృ శాపాలు( Pitru Shapalu ) వంటి వాటి వల్ల ఇబ్బందులు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే గతించినటువంటి పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు అందకపోవడం వల్ల పితృ దేవతలు కనుక బాధకు గురైనట్లు అయితే వారి ప్రవాహం చేత వారి వంశస్తులకు, కుటుంబం నందు అశాంతి, రుణ భాదలు వంటివి పెరగడం, అనారోగ్య సమస్యలు కలవడం వంటివి జరుగుతాయని పండితులు చెబుతున్నారు.ఇలా పితృ శాపాలు తొలగించుకోవడానికి, పితృ దోషాలు తొలగించుకోవడానికి పితృ దేవతల అనుగ్రహం సంపాదించుకోవడానికి మహాలయ పక్షము( Mahalaya Paksham ) అద్భుతమైనటువంటి అవకాశం అని పండితులు చెబుతున్నారు.

అలాగే ఎవరైతే గతించినటువంటి పితృదేవతలకు ఈ మహాలయ పక్షాలలో పితృ తర్పణాలు, పిండప్రదానాలు, దానధర్మాలు వంటి కార్యక్రమాలు చేస్తే తల్లిదండ్రులు( Parents ) మరియు పితృదేవతలకు ఆ తిధిని అనుసరించి మహాలయ పక్షాలలో ఆచరిస్తారో వారికి పితృ దోషాలు, పితృ శాపాలు తొలగి పితృదేవతల అనుగ్రహం లభించి చేసే ఏ పనిలోనైనా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల పితృ శాపాలు, పితృ దోషాలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు.