ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్( WhatsApp ) కొన్నాళ్లనుండి వినియోగదారుల సౌకర్యార్థం ఒకదాని తర్వాత ఒకటి ఆకర్షణీయమైన ఫీచర్లను విడుదల చేస్తూ ఖుషీ చేస్తోంది అనడంలో సందేహమే లేదు.అనేక కొత్త అప్డేట్ లు ఇప్పటికే పరీక్ష దశలో ఉండగా త్వరలో వినియోగదారులకు అవి మరింత అందుబాటులోకి రానున్నాయి.
ఈ క్రమంలోనే వాట్సాప్ మరో ఉపయోగకరమైన ఫీచర్‌తో ఇపుడు మీ ముందుకు వస్తోంది.ఇప్పుడు మీరు ఈ కొత్త ఫీచర్ ద్వారా ఒకే వాట్సాప్‌లో వేర్వేరు ఖాతాలను( Multiple accounts ) ఉపయోగించుకునే వెసులుబాటు వుంటుంది మరి.

అవును, మనలో చాలమందికి అవసరాన్ని బట్టి వివిధ అకౌంట్లను వాడాల్సి రావచ్చు.దానికోసం మనం వేరే నంబర్లతో క్రియేట్ చేసిన అకౌంట్స్ ని వాడాల్సి రావచ్చు.ఈ విషయంలో ఈపాటికే కొంతమందికి అసహనం ఏర్పడవచ్చు.ఎందుకంటే ప్రతి సారీ రెండు చోట్ల, వేరు వేరు నంబర్లతో ఖాతా తెరిచిన వానిని నిర్వహించడం కాస్త కస్టతరం కావచ్చు కనుక.
అయితే ఈ ఇబ్బందిని గుర్తించిన వాట్సాప్ త్వరలో తన వినియోగదారులకు ఈ ఆప్షన్‌ను అందించనున్నట్లు సమాచారం.సరళంగా చెప్పాలంటే, ఈ కొత్త ఫీచర్‌తో ఒకే వాట్సాప్ అప్లికేషన్‌లో ఎక్కువ వాట్సాప్ ఖాతాలను స్విచ్ తరహాలో తెరవవచ్చన్నమాట.

ఈ ఎంపిక ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ , ఫేస్ బుక్( Instagram ) లో అందుబాటులో వుండగా ఇపుడు వాట్సప్ కూడా ఆ సౌకర్యాన్ని కల్పిస్తోంది.కాగా ప్రస్తుతం వాట్సాప్ వినియోగదారులను ఒక మొబైల్‌లో ఒక ఖాతాతో మాత్రమే లాగిన్ చేయడానికి అనుమతిస్తుందనే విషయం విదితమే.అందుకే వేర్వేరు ఫోన్ నంబర్‌లతో రెండు వాట్సప్ ఖాతాలను ఉపయోగించే వినియోగదారులు 2 మొబైల్‌లను ఉపయోగించాలి.ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది.
రాబోయే వారాల్లో మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి.