మీరు పుట్టిన తేదీ( Birth Date ) ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల కచ్చితంగా ధనవంతులు అవుతారు.మరి ఏ తేదీలో పుట్టిన వారు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డబ్బులు సంపాదించాలని కోరిక దాదాపు అందరిలోనూ ఉంటుంది.డబ్బులు సంపాదించడం కోసం చాలా మంది చాలా రకాలుగా కష్టపడుతూనే ఉంటారు.
కానీ ఎంత కష్టపడినా అందరూ డబ్బును సంపాదించలేరు.అలాగే సంపాదించిన డబ్బు( Money ) నిల్వ కూడా ఉండదు.
న్యూమరాలజీ ప్రకారం మీరు పుట్టిన తేదీ ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల కచ్చితంగా ధనవంతులవుతారు.మరి ఏ తేదీలో పుట్టిన వారు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నెలలో 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారు ప్రతి రోజు సూర్య భగవానున్ని పూజించాలి.

సూర్య నమస్కారం( Surya Namaskar ) చేసి నీరు సమర్పించాలి.ఇలా చేయడం వల్ల మీరు కచ్చితంగా ధనవంతులవుతారు.అలాగే నెలలో రెండు, పదకొండు, 20, 29 తేదీలలో పుట్టిన వారు ప్రతి రోజు వెండి గ్లాసులో నీరు త్రాగాలి.
రోజు వెండి గ్లాసులో మంచినీళ్లు( Silver Glass ) తాగడం వల్ల వారి జీవితంలో కష్టాలు తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం పొందవచ్చు.అలాగే నెలలో 3, 12 , 21, 30 తేదీలలో పుట్టిన వారు ప్రతి రోజు స్నానం చేసే ముందు నీటిలో చిటికెడు పసుపు వేసుకోవాలి.
ఇలా చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయడం వల్ల వారు ఖచ్చితంగా భవిష్యత్తులో ధనవంతులవుతారు.

అలాగే నెలలో నాలుగు, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారు ప్రతి రోజు దుర్గామాత( Durga Devi )ను పూజించాలి.ఇలా చేయడం వల్ల మీరు ధనవంతులవుతారు.అలాగే నెలలో ఐదు, 14, 23 తేదీలలో పుట్టిన వారు ప్రతి రోజు తమ వద్ద యాలకులు ఉంచుకోవాలి.
యాలకులు మన వంటింట్లో సులభంగా లభిస్తాయి.ఇలా చేయడం వల్ల మీరు ధనవంతులు అవుతారు.
అలాగే నెలలో 6,15, 24 తేదీలలో పుట్టిన వారు పర్ఫ్యూమ్ వాడడం అలవాటు చేసుకోవాలి.ప్రతి రోజు ఇలా చేస్తే మీరు ధనవంతులు అవుతారు.
అలాగే నెలలో ఏడు, 16, 25 తేదీలలో పుట్టిన వారు ప్రతి రోజు చేతికి వెండి లేదంటే బంగారం స్టాప్స్ ఉన్న వాచ్ ను ధరించాలి.ఇలా చేస్తే వీరు ధనవంతులు అవుతారు.
అలాగే నెలలో 8, 17, 26 తేదీలలో పుట్టిన వారు అమెథిస్ట్ అనే రాయిని ధరించాలి.ఈ రాయితో చేసిన ఉంగరం లేదంటే ఇంకా ఏదైనా ఆవరణం ధరించడం వలన ధన ప్రాప్తి కలుగుతుంది.
అలాగే నెలలో 9, 18, 27 తేదీలలో పుట్టిన వారు ప్రతి మంగళవారం జాస్మిన్ ఆయిల్ తో ఇంట్లో దీపం వెలిగించాలి.ఇలా చేస్తే వారికి ధన ప్రాప్తి కలుగుతుంది.