దర్శనంతోనే దోషాలు తొలగించే మన దేశంలోని గణపతి ఆలయాలు ఇవే..!

హిందూ సనాతన ధర్మంలో ఆదిపూజ్యుడు విఘ్నలకధిపతి గణేశుడు.ఏ భక్తుడైన ముందుగా గణపతిని నిష్టతో, భక్తితో పూజిస్తే శుభాలు జరుగుతాయి.

 These Are The Ganapati Temples In Our Country That Remove The Errors Just By See-TeluguStop.com

అలాగే జీవితం సుఖమయం అవుతుందని ప్రజలు నమ్ముతారు.గణపతిని ఆరాధించడం ద్వారా జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగి సుఖసంపదలు కలుగుతాయని ప్రజలు నమ్ముతారు.

జీవితంలోని ప్రతి రంగంలోనూ ఆశించిన విజయం లభిస్తుంది.గణపతి జ్ఞానానికి అధిపతి.

భారతదేశంలో గణేశుడికి సంబంధించిన అనేక దేవాలయాలు ఉన్నాయి.

ఈ దేవాలయాలను దర్శనంతోనే కోరికలు నెరవేరుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు.

ఈ దేవాలయాలు ఎక్కడున్నాయి, పూజ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం( Sri Siddhi Vinayaka Temple ) దేశంలోనే ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి.

ఒక భక్తుడు సిద్ధి వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత అతనిపై అనుగ్రహం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు.గణపతి ఆశీస్సులతో ఎటువంటి సమస్యలైనా క్షణాల్లో పరిష్కారం అవుతాయని భక్తులు చెబుతున్నారు.

Telugu Devotional, Motidoongri, Mumbai, Pune, Srisiddhi-Telugu Bhakthi

సిద్ధి వినాయక దేవాలయాన్ని సామాన్యుడు మాత్రమే కాదు చాలామంది సెలబ్రిటీలు కూడా దర్శించుకుంటున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే పూణేలోని సుందర్ నగర్ లోని గణపతికి చెందిన దగ్దుసేత్ హల్వాయి దేవాలయం( Dagdusheth Ganpati ) అద్భుతలతో నిండి ఉంటుంది.అలాగే ఈ దేవాలయంలో సంవత్సరం పొడుగునా భక్తుల రద్దీ ఉంటుంది.ఈ దేవాలయాన్ని దగ్దుసేత్ హల్వాయి నిర్మించారని అప్పటినుంచి ఈ పేరుతోనే ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది.బంగారు తో చేసిన గణపతి విగ్రహాన్ని దర్శనం చేసుకున్నాక కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్ముతారు.

Telugu Devotional, Motidoongri, Mumbai, Pune, Srisiddhi-Telugu Bhakthi

రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని చాంద్‌పోల్ ప్రాంతంలో మోతీ డోంగ్రీ దేవాలయం( Moti doongri ganesh ) ఉంది.ఇక్కడ వెలిసిన గణపతి పై భక్తులకు చాలా నమ్మకం ఉంది.మూంగ్ దాల్ లడ్డూలు నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.

ఈ దేవాలయంలో విగ్రహం 800 సంవత్సరాల నాటి అత్యంత పురాతనమైనదని భక్తులు చెబుతున్నారు.ఇక్కడ కొత్త వాహనాలకు పూజలు నిర్వహిస్తారు.

ఈ దేవాలయంలో కొత్త వాహనాన్ని పూజిస్తే ప్రమాదాలు జరగవు నమ్ముతారు.అలాగే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉన్న ఖజ్రానా గణపతి దేవాలయం చాలా ప్రత్యేకమైనది.

ఇక్కడ గణపతి తన భార్య సిద్ధి, బుద్ధిలతో కొలువై ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube