పీసీసీ అధ్యక్షుడి ఎంపిక : రేవంత్ సూచించిన వారికే ఛాన్స్ 

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలనూ నిర్వహిస్తున్నారు.అటు పార్టీ ,ఇటు ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే విషయంలో రేవంత్ ఒత్తిడికి గురవుతున్నారు.

 Selection Of Pcc President: Only Those Recommended By Revanth Have A Chance, Pc-TeluguStop.com

దీంతో పిసిసి అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించాలని ఇప్పటికే అధిష్టానం పెద్దలకు రేవంత్ రెడ్డి విన్నవించారు.తాజాగా ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి మంత్రి పదవులు భర్తీ విషయంతో పాటు,  తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొత్తవారిని నియమించాలనే విషయం పైన చర్చించారు.

అయితే పీసీసీ అధ్యక్ష పదవి( PCC President ) రేసులో చాలామంది ఉన్నారు.

Telugu Addanki Dayakar, Aicc, Madhu Yashki, Pcc, Pcc Cheif, Revanth Reddy, Sitak

మాజీ మంత్రి మధు యాష్కీ గౌడ్ , అద్దంకి దయాకర్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్,  ఎస్టి సామాజిక వర్గం నుంచి సీతక్క , బలరాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి .తెలంగాణ సీఎం గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వడంతో,  పిసిసి అధ్యక్షుడిగా బిసి కి ఛాన్స్ ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో అధిష్టానం పెద్దలు ఉన్నారట .అయితే రేవంత్ రెడ్డి( Revanth Reddy )కి ఈ విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశాన్ని అధిష్టానం పెద్దలు కల్పించారట.రేవంత్ కు సన్నిహితులైన వారిని కాకుండా వేరే ఎవరైనా పిసిసి అధ్యక్షులుగా నియమిస్తే ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయని,  క్రమంగా పార్టీలో అసమ్మతి తలెత్తి మొదటికే మోసం వస్తుందని కాంగ్రెస్ పెద్దలు.భావిస్తున్నారట అందుకే రేవంత్ కే పిసిసి అధ్యక్షుడిని నియమించుకునే అవకాశాన్ని కల్పించారట.

రాహుల్ గాంధీ ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛను రేవంత్ క కల్పించినట్లు సమాచారం.ప్రస్తుత మంత్రిగా ఉన్న మంత్రి సీతక్క( Sitakka ) పేరును రేవంత్ తెరపైకి తెచ్చినట్లు సమాచారం.

Telugu Addanki Dayakar, Aicc, Madhu Yashki, Pcc, Pcc Cheif, Revanth Reddy, Sitak

గిరిజన మహిళలకు పిసిసి పగ్గాలు అప్పగించడం ద్వారా ప్రజల్లో సానుకూలత పెరుగుతుందని రేవంత్ అంచనా వేస్తున్నారట.అయితే మంత్రులుగా ఉన్నవారికి పిసిసి అధ్యక్ష పదవి కట్టబెడితే ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తున్నారట ఈ నేపథ్యంలోనే కొంతమంది సన్నిహితుల పేర్లను రేవంత్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే పిసిసి అధ్యక్షు బాధ్యతలు రేవంత్ రెడ్డి స్వీకరించి మూడేళ్లు పూర్తవుతుంది.జూలై 7వ తేదీ నాటికి కొత్త అధ్యక్షుడు నియమించే ఛాన్స్ కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube