డైరెక్టర్ నాగ్ అశ్విన్( Nag Ashwin ) దర్శకత్వంలో ప్రభాస్( Prabhas ) దీపికా పదుకొనే( Deepika Padukone ) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం కల్కి( Kalki ) .ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మైథాలజీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇకపోతే ఈ సినిమాలో ఎంతోమంది సెలబ్రిటీలు భాగమయ్యారు.
విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, అమితాబ్, కమల్ హాసన్ వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు.
ఇక వీరితోపాటు మరొక స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) కూడా ఈ సినిమాలో భాగమైన సంగతి మనకు తెలిసిందే.ఈమె దివ్య అనే ఒక చిన్న పాత్రలో నటించారు.ఈ సినిమా మొదలైన 10 నిమిషాలలోపే మృణాల్ ఎంట్రీ ఉంటుంది.
ఇక ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో కల్కి సినిమాలో ఇలా చిన్న పాత్రలో కనిపించడం పట్ల అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.అసలు ఇలాంటి ఒక చిన్న పాత్రలో నటించడానికి కారణం ఏంటనే కూడా ప్రశ్నలు వేస్తున్నారు.
ఇలా కల్కి సినిమాలో తాను నటించడం గురించి మొదటిసారి మృణాల్ స్పందించారు.నిజానికి కల్కిలో కేమియో చేయాలని మూవీ టీమ్ నన్ను సంప్రదించినప్పుడు నేను ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు అసలు సినిమా కథ ఏంటి నా పాత్ర ఏంటి అనే విషయాలను కూడా అడగకుండానే ఈ సినిమాకు ఎస్ చెప్పానని తెలిపారు.ఎందుకంటే ఈ సినిమా విడుదలైన తర్వాత సంచలనంగా మారుతుందని నాకు ముందే తెలుసు.ఇలాంటి ఒక గొప్ప ప్రాజెక్టులో నటించడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తున్నానని మృణాల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.