టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి( Chiranjeevi ) ప్రస్తుతం విశ్వంభర( Vishwambara ) సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఎన్నో కీలకమైన సమాజానికి ఎంతో ప్రయోజనకరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana Government ) కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే డ్రగ్స్( Drugs ) రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే విషయంపై ఇప్పటికే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు.
ఈ క్రమంలోనే చిరంజీవి సైతం డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగమౌతూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది.తెలంగాణ సీఎంఓ నేతృత్వంలోని డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని చిరు చెప్పారు.అయితే మీ చుట్టుపక్కల, మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ వాడుతున్న లేకపోతే క్రయ విక్రయాలు చేస్తున్న వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో 87126 71111 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.
ఇలా సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.ఇలాంటి వ్యసనాలకు బానిసైన వారిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం తప్ప శిక్షించడం కాదని తెలిపారు.ఇలా ప్రభుత్వం చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపాలని, మార్పు కోసం ప్రయత్నాలు చేయాలి అంటూ చిరంజీవి తెలియచేశారు.ఇక డ్రగ్స్ వంటి వాటిని వాడటం వల్ల కలిగే అనర్థాలు ఎలా ఉంటాయో తెలియజేస్తూ ఒక వీడియోని కూడా షేర్ చేశారు.
ఇక ప్రస్తుతం ఈయన సినిమాల విషయానికి వస్తే విశ్వంభర సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.ఈ సినిమా వచ్చే ఎడాది సంక్రాంతిని పురస్కరించుకొని జనవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.