1.నేను ఏది మాట్లాడినా ప్రజల కోసమే : గవర్నర్
తానెప్పుడూ నిర్మాణాత్మకంగా నే మాట్లాడతానని తాను ఏం మాట్లాడినా అది తెలంగాణ ప్రజల కోసమేనని తెలంగాణ గవర్నర్ తమిళ సై అన్నారు.
2.కెసిఆర్ పై షర్మిల విమర్శలు
రైతుల కోసం కొట్లాడుతున్నామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రం వద్ద ఎందుకు పెట్టారని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కెసిఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.
3.రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరుకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
4.తిరుమల సమాచారం
తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.బుధవారం తిరుమల శ్రీవారిని 68,009 మంది భక్తులు దర్శించుకున్నారు.
5.వైద్య శాఖలో 21,073 ఉద్యోగాల మంజూరు
తెలంగాణ వైద్య శాఖ లో కొత్తగా 21,073 ఉద్యోగాలను మంజూరు చేసినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
6.జడ్జీల విదేశీ ప్రయాణాలకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు : ఢిల్లీ హైకోర్టు
సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలు వ్యక్తిగత పనులపై విదేశాలకు వెళ్లాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది.
7.ఆర్టీసీ డీజిల్ సెస్
తెలంగాణ ఆర్టిసి డీజిల్ సెస్ విధించాలని భావిస్తోంది.
8.అమిత్ షా తో తెలంగాణ గవర్నర్ భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళ సై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు.
9.బీజేపీ పై మంత్రి తలసాని కామెంట్స్
బిజేపి పై మంత్రి తలసాని శ్రీనివాస్ కామెంట్ చేశారు.బీజేపీ నేతలు దద్దమ్మలు అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు చేశారు.
10.రోడ్డు ప్రమాద మృతుల్లో అగ్రస్థానంలో భారత్
రోడ్డు ప్రమాదం మృతులు అగ్రస్థానంలో భారత్ ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
11.నీట్ పరీక్షల తేదీ ఖరారు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల తేదీ షెడ్యూల్ ప్రకటించింది.జులై 17న నీట్ పరీక్ష నిర్వహించనున్నారు.
12.టిడిపి జనసేన పై జగన్ విమర్శలు
టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్ ఫ్రెండ్షిప్ విమర్శలు చేశారు.ఆశ కళ్యాణం దోచుకు చిన్న చంద్రబాబు దొంగలముఠా అంటూ జగన్ విమర్శించారు.
13.బెంగళూరు బెల్ లో 91 ఖాళీల భర్తీ
బెంగుళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 91 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
14.మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన కామెంట్స్
జగన్ కోసం తన తల కోసుకోవదానికి కూడా సిద్ధమేనని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన కామెంట్స్ చేశారు.
15.4,775 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల విభాగంలో 4,775 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది
16.ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
వెలగపూడి లోని తాత్కాలిక సచివాలయంలో గురువారం మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది.
17.రైతులను మోసం చేసింది చంద్రబాబే
రైతులను మోసం చేసింది టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అని సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు.
18.భారత పవర్ గ్రిడ్ పై చైనా హ్యాకర్ల దాడి
చైనా హ్యాకర్లు మరోసారి భారత్ భారత్ పవర్ గ్రిడ్ లో కి కీలక సమాచారాన్ని అపహరించినట్లు సమాచారం.
19.మంత్రి కేటీఆర్ కామెంట్స్
రైతుల కోసం మాట్లాడిన తెలంగాణ మంత్రులను కేంద్ర మంత్రి గోయల్ అవమానించారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పీయూష్ గోయల్ ను తరిమి కొడతాం అని ఆయన హెచ్చరించారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -48,000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,370
.