ఉక్రెయిన్- రష్యా యుద్ధం వివిధ దేశాలపైనా, వ్యక్తులు, సంస్థలపైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపిస్తోంది.బ్రిటన్ ఆర్ధిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునక్ వీరిలో ఒకరు.
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడైన రిషి కుటుంబం ఉక్రెయిన్ యుద్ధం వల్ల యూకేలో వార్తల్లో నిలుస్తోంది.ఇన్ఫోసిస్ ఎప్పడి నుంచో రష్యాలోనూ తన వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
యుద్ధం నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన వార్తా సంస్థ రిషి సునక్‌పై ఇటీవల ప్రశ్నల వర్షం కురిపించింది.అమెరికాతో పాటుగా యూరప్ దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలను విధించిన నేపథ్యంలో రష్యాలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలపై సునక్‌ను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించింది.
యూకే ఆర్థిక మంత్రి కుటుంబ సభ్యులు రష్యాతో వ్యాపారాలు చేయడం ఎంత వరకూ సబబు అంటూ సదరు సంస్ద నిలదీసింది.దీనికి రిషి సునక్ కౌంటరిచ్చారు.‘తాను ఇక్కడికి ఎన్నికైన ప్రజాప్రతినిధిగా వచ్చానని.తాను దేనికి బాధ్యత వహిస్తానో దాని గురించి చర్చించేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.
ఇన్ఫోసిస్‌కు చెందిన వ్యవహారం పూర్తిగా కుటుంబ సభ్యులే చూసుకుంటారని రిషి సునక్ తెలిపారు.కంపెనీ వ్యవహారాలతో తనకేలాంటి సంబంధాలు లేవన్న ఆయన… ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న చర్యలను ఖండించారు.
అయినప్పటికీ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడటం లేదు.
తాజాగా రిషి సునక్ భార్య అక్షతా మూర్తి పన్ను చెల్లింపులకు సంబంధించి వివాదం రేగుతోంది.
ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం ఆమె బ్రిటన్‌లో నివాసం లేని వ్యక్తిగా పరిగణించబడుతోంది.అయితే అక్షత తన ఆదాయంపై బ్రిటన్‌లో పన్ను చెల్లిస్తున్నారని ఆమె ప్రతినిధి వెల్లడించారు.అక్షతా మూర్తికి ఇన్ఫోసిస్‌లో దాదాపు 0.93 శాతం వాటా వుంది.అయితే ఆమె భారతీయ వ్యాపారంపై వచ్చే డివిడెండ్లపై బ్రిటన్‌లో పన్ను చెల్లించడం లేదు.

గురువారం బ్రిటన్ వార్తాపత్రికలలో ఈ వార్త ప్రముఖంగా కనిపించింది.ఈ ఏడాది ప్రభుత్వం లక్షలాది మందికి పన్నులు వేస్తున్నట్లు ఈ కథనాల సారాంశం.ఈ క్రమంలోనే తన భార్య పన్ను హోదా నుంచి ప్రయోజనం పొందాడో లేదో రిషి సునక్ చెప్పాలంటూప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు, ట్రెజరీ ప్రతినిధి తులిప్ సిద్ధిక్ డిమాండ్ చేశారు.
దీనిపై అక్షతా మూర్తి అధికారిక ప్రతినిధి స్పందిస్తూ.భారతీయ పౌరురాలిగా వున్న ఆమెను బ్రిటీష్ చట్టాల ప్రకారం నాన్ – డొమిసిల్డ్‌గా పరిగణిస్తున్నారని చెప్పారు.ఎందుకంటే భారత ప్రభుత్వం .తన పౌరుల్ని ఏకకాలంలో మరో దేశ పౌరసత్వాన్ని కలిగి వుండేందుకు అనుమతించదని ఆయన పేర్కొన్నారు.ఇకపోతే.అక్షతా మూర్తి భారతీయ పౌరురాలు.ఆమె పుట్టిన దేశం, తల్లిదండ్రుల నివాసం అక్కడేనని అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.సునక్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.
తన భార్య స్థితిని ప్రభుత్వానికి తెలియజేశాడని, ట్రెజరీ శాఖకు కూడా సమాచారం అందించారని ఓ వ్యక్తి తెలిపాడు.అయితే రిషి సునక్ తన విదేశీ ఆదాయంపై పన్నులు చెల్లిస్తున్నారని సదరు వ్యక్తి వెల్లడించాడు.
2020 ఫిబ్రవరిలో ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునక్.1950ల తర్వాత అత్యధిక స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని చూస్తున్నారు.నేషనల్ హెల్త్ సర్వీస్, పబ్లిక్ ఫైనాన్స్‌ల పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు గాను 1940ల తర్వాత పన్ను స్థాయిని పెంచారు రిషి సునక్.
.






