ప్రేమ గుడ్డిది అంటారు.ప్రేమించిన పాపానికి ఎన్ని దారుణాలనైనా అనుభవించాలి అంటారు.
అయితే హీరోయిన్ మౌనిక బేడీ కూడా ప్రేమించిన పాపానికి దుర్గంధం వెదజల్లే జైలు జీవితాన్ని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 ఏళ్ళు అనుభవించింది.ముక్కు మొహం తెలియని ఎవడో విదేశస్థుడు ప్రేమిస్తున్నాను అని చెప్పగానే వాడి మాయలో పడి ఆమె భారత దేశాన్ని విడిచి దుబాయ్ వెళ్ళిపోయింది.
తాను ప్రేమించిన వ్యక్తి పెద్ద శ్రీమంతుడు అని పైపై మెరుగులు చూసి బుట్టలో పడింది.చివరికి తాను ప్రేమ మత్తులో ఎంత పెద్ద తప్పు చేశానో అని తెలుసుకొని కన్నీరుమున్నీరైంది.
ఆమె మరెవరో కాదు జోడి నెంబర్ వన్ సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ నటిమణి మౌనిక బేడి.
ఐతే ఆమె తాను ప్రేమించిన అబు సలీమ్ ని 1999 లో పెళ్లి చేసుకుంది కానీ తీరా చూశాక అతను ఒక అండర్ వరల్డ్ డాన్ అని తెలిసి ఖంగు తిన్నది.
తిరిగి ఇంటికి వచ్చేద్దామనుకుంది కానీ అబు సలీమ్ ఆమె ను బంధీ ని చేశాడు.నువ్వు లేకుండా నేను బతకలేను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.దీనితో ఆమె కూడా అతన్ని విడిచి వెళ్లలేకపోయింది.మోనికా ని విడిచిపెడితే తన రహస్యాలు ఎక్కడా చెబుతుందేమో అని అబు సలీం ఆమెను అసలు బయటకు పంపించలేదు.
ఒక రూమ్ లో బంధీగా ఉంచి ఆమె చేత అన్ని పనులు చేయించాడు.చివరికి ఆమె బాత్రూం లు కూడా కడిగింది.
ఒకానొక సమయంలో అబు నుంచి తప్పించుకొని ఒక హోటల్ కి వెళ్ళిపోయింది కానీ ఆమెను అబు టీమ్ పట్టుకొని మళ్ళీ బంధించింది.
అయితే 2002 లో దొంగ పాస్పోర్ట్ లతో అబు తో సహా అరెస్ట్ అయినప్పుడు ఆమె చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యింది.ఆ అరెస్ట్ తనకు విముక్తి తో సమానం అని ఆమె చెప్పిందంటే.అబు సలీమ్ దగ్గర ఉన్నప్పుడు ఆమె ఎంత నరకాయతన పడిందో అర్థం చేసుకోవచ్చు.
అయితే అరెస్టయి జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో కూడా అబు మోనికా పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరిచాడు.ఫోన్ కాల్ చేయటం, పుట్టినరోజు నాడు పూలు పంపించడం వంటివి చేసేవాడు.
కానీ మోనికా అతన్ని శాశ్వతంగా విడిచిపెట్టి ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకుంది.ఐతే వీళ్లిద్దరు 2005వ సంవత్సరంలో పోర్చుగల్ జైలునుంచి ముంబై బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇండియాకి తరలించబడ్డారు.
అయితే ఇండియా వచ్చిన ఆమెపై పోలీసులు అనేక రకాల కేసులు బనాయించారు.దీంతో ఆమె 2010 వరకు జైల్లోనే జీవితం గడపాల్సి వచ్చింది.చివరకు సత్ప్రవర్తన కారణంగా ఆమె జైలు నుంచి విడుదల అయింది.అయితే ప్రేమించిన పాపానికి తాను ఎంతో కష్టపడ్డానని.
జైల్లో ఉన్నన్ని రోజులు ఒక గదిలో ఓపెన్ టాయిలెట్ తో జీవితాన్ని కొనసాగించలేక చావలేక తాను ఎంతో మానసిక క్షోభకు గురయ్యానని మోనికా చెబుతుంటారు.అలాగే తనని అబు నిజంగానే ప్రేమించాడని ఆమె నమ్ముతుంటారు.
అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆమెకు అద్దె ఇల్లు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు.ఆమె ఒక నేరస్తురాలు అని చాలా మంది బయటికి గెంటేశారు.
అయితే కొంత కాలం తర్వాత అన్నీ సద్దుమణిగాయి.దీనితో ఆమె మళ్లీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ సంతోషమైన జీవితాన్ని గడుపుతుంది.