అడవిలో మాత్రమే మృగాలుంటాయి కానీ సమాజంలో మనిషి తోలు కప్పుకున్న తోడేళ్లు మాత్రం అడుగడుగునా ఉన్నాయి.ఈ మృగాలు మాటువేసి కాటువేస్తున్నాయి.
ఒక మనిషికి వయస్సు పెరిగితే బుద్ధి, జ్ఞానం పెరిగినట్టు.కానీ కొందరిలో వయస్సు పెరుగుతున్న కొద్ది కామం పాములా బుసలు కొడుతుంది.
ఆ సమయంలో వారి కోరిక తీర్చుకోవడానికి ఆడపిల్ల అయితే చాలు.వయస్సుతో సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఇలాంటి దుర్మార్గులను చూస్తుంటే కంపరం వేయకుండా ఉండదు.
ఇకపోతే గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో ఐదేళ్ల బాలికపై, పాముల సురేష్(50) సంవత్సరాల వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు.ఈ ఘటన గత నెల 29న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇక విషయం తెలుసుకున్న బంధువులు కొల్లిపర పోలీసులను ఆశ్రయించగా వారు స్పందించలేదని సమాచారం.
అయితే తప్పు చేసిన నిందితుడు మాత్రం ప్రశ్నించిన బాలిక బంధువుల పై బెదిరింపులకు పాల్పడుతూ, దాడికి దిగినాడట.
మరి ఇలాంటి సామాన్య బాధిత కుటుంబాలకు న్యాయం చేసే వారే కరువైన సమాజంలో వీరి రోదన జడి వానలో కన్నీటి బిందువుల్లా మిగిలిపోవలసిందేనా అని బాధపడని హృదయం లేదట.