ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను( Padma Awards ) ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ పద్మ అవార్డులలో భాగంగా తెలుగు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) కు కూడా పద్మభూషణ్( Padma Bhushan ) అవార్డు వచ్చింది.
ఇలా బాలయ్య కళా రంగానికి చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తనకు పద్మ భూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలియచేయడంతో ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు అభిమానులు రాజకీయ నాయకులు సైతం బాలకృష్ణకు అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు.
ఈ క్రమంలోనే తనకు అభినందనలు తెలియజేసిన వారందరికీ బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా తనని ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్న ప్రేక్షకులకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని బాలయ్య ఎమోషనల్ అయ్యారు.అలాగే తనకు పద్మ భూషణ్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఇక బాలకృష్ణకు ఇంతటి గొప్ప పురస్కారం లభించడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… తెలుగు సినిమాకు అందించిన సేవలకు గాను, పద్మ భూషణ్ అవార్డును అందుకోవడానికి ఆయన పూర్తిగా అర్హులు అంటూ ఈ సందర్భంగా బాలయ్యకు అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు.అలాగే ఈ అవార్డుకు ఎంపికైన మరొక హీరో అజిత్ సాధించిన ఘనత తనకు ఎంతగానో స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు.ఇక పద్మ అవార్డులకు ఎంపికైనటువంటి నటి శోభన, శేఖర్ కపూర్, అనంత్ నాగ్ లకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే ఇటీవల పుష్ప 2 సినిమాతో సక్సెస్ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది.