నిన్న మన భారతదేశ ప్రజలందరూ 76వ గణతంత్ర దినోత్సవాన్ని( 76th Republic Day ) అంగరంగ వైభవంగా జరుపుకుంది.ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో( President Droupadi Murmu ) పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో( Prabowo Subianto ) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇద్దరు నేతలు సంప్రదాయ బగ్గీలో ఊరేగుతూ పరేడ్‌కు హాజరయ్యారు.సుబియాంటో తొలిసారిగా భారత పర్యటనకు రావడం విశేషం.
అంతేకాదు, భారత ప్రభుత్వం అత్యంత గౌరవంగా భావించే ‘స్టేట్ విజిట్’( State Visit ) హోదా దక్కిన నాల్గవ ఇండోనేషియా నేతగా ఆయన చరిత్ర సృష్టించారు.
వేడుకల్లో మొదటగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఆపై జాతీయ గీతం ఆలపించగా, 21 గన్ సెల్యూట్‌తో సైనికులు గౌరవ వందనం సమర్పించారు.ఈ సమయంలో 300 మంది కళాకారులు ‘సారే జహాఁ సే అచ్చా’ దేశభక్తి గీతాన్ని అద్భుతంగా పాడి వావ్ అనిపించారు.
అంతేకాదు, Mi-17 1V హెలికాప్టర్లు ఆకాశం నుంచి పూరేకుల జల్లు కురిపిస్తూ వేడుకలను మరింత ఆకర్షణీయంగా మార్చేశారు.

ఈ వేడుకల్లో ఇండోనేషియా మిలిటరీ బ్యాండ్ ‘గెండెరాంగ్ సులింగ్ చంకా లోకనంత’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇండోనేషియన్ మిలిటరీ అకాడమీకి చెందిన 190 మందితో కూడిన ఈ బ్యాండ్ బృందం ఇండోనేషియా సైనిక క్రమశిక్షణను, గొప్ప సైనిక సంప్రదాయాన్ని చాటిచెప్పింది.వారి ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇక అసలు విషయానికొస్తే, అధ్యక్షుడు సుబియాంటో గౌరవార్థం రాష్ట్రపతి ముర్ము రాష్ట్రపతి భవన్‌లో విందు ఏర్పాటు చేశారు.ఈ విందులో ఇండోనేషియా మంత్రులు షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ సాంగ్ ‘కుచ్ కుచ్ హోతా హై’( Kuch Kuch Hota Hai ) పాటను పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.సూట్లు, సంప్రదాయ టోపీలు (సాంగ్‌కోక్) ధరించి మంత్రులు పాట పాడుతుంటే అక్కడున్న వారంతా ఆనందంతో మునిగిపోయారు.కరణ్ జోహార్ దర్శకత్వంలో షారుఖ్, రాణి ముఖర్జీ, కాజోల్ నటించిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.
మంత్రులు పాట పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి విశేషమైన ప్రశంసలు అందుకుంది.
అంతేకాదు, అధ్యక్షుడు సుబియాంటో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
ఇరు దేశాల మధ్య రాజకీయ, రక్షణ, భద్రతా సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించారు.







