ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు( Noida ) చెందిన 14 ఏళ్ల విద్యార్థి దక్ష్ మాలిక్( Daksh Malik ) అరుదైన విజయాన్ని అందుకున్నాడు.తాను కనుగొన్న గ్రహశకలానికి తానే పేరు పెట్టే అవకాశాన్ని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్( NASA ) అతడికి కల్పించింది.సాతో భాగస్వామిగా ఉన్న ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్ (IASC) కింద, 2023లో దక్ష్ మాలిక్ తన స్నేహితులతో కలిసి ఓ గ్రహశకలాన్ని( Asteroid ) గుర్తించాడు.2022లోనే దక్ష్ తన ఇద్దరు స్నేహితులతో ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమయ్యాడు.వారి స్కూల్‌కు చెందిన ఆస్ట్రోనమీ క్లబ్ నుంచి నాసా ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనమికల్ సెర్చ్ కొలాబరేషన్ (IASC) కు పంపిన మెయిల్ ద్వారా ఈ అవకాశం లభించింది.
దీంతో దక్ష్ తన స్నేహితులతో కలిసి ఏడాదిన్నర పాటు అంతరిక్షాన్ని( Space ) శోధించి 2023లో ఈ గ్రహశకలాన్ని కనుగొన్నాడు.దీనికి ప్రస్తుతానికి “2023 OG40” అనే పేరు పెట్టారు.ప్రస్తుతం నాసా ఈ గ్రహశకలానికి శాశ్వతంగా పేరు పెట్టే అవకాశాన్ని దక్ష్ మాలిక్‌కు ఇచ్చింది.తన చిన్ననాటి కల సాకారమైనందుకు దక్ష్ మాలిక్ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు.“చిన్నప్పటి నుంచి అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండేది.గ్రహాలు, సౌర వ్యవస్థ గురించి నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీలు తరచూ చూడడం నన్ను ప్రేరేపించాయి” అని దక్ష్ తెలిపాడు.
తాను ఎప్పుడూ నాసాలో పని చేస్తున్న శాస్త్రవేత్తగా ఊహించుకునేవాడినని, ఇప్పుడు ఆ కల నిజమైనంతగానే అనిపిస్తోందని అన్నారు.తాను కనుగొన్న గ్రహశకలానికి “డిస్ట్రాయర్ ఆఫ్ ది వరల్డ్” లేదా “కౌంట్‌డౌన్” వంటి పేరు పెట్టాలని అనుకుంటున్నానని వెల్లడించాడు.ఇంత చిన్న వయస్సులోనే గొప్ప ప్రతిభను చూపించిన దక్ష్ మాలిక్, తన విజ్ఞానంతో ప్రపంచానికి మరింత మంచి పేరు తీసుకురావాలన్న ఆశయాన్ని వ్యక్తం చేశాడు.
దక్ష్ లాంటి యువ ప్రతిభావంతులను ప్రోత్సహించాలి, మళ్లీ ఇలాంటివి జరిగేలా పిల్లల ఆసక్తిని పెంచాలి.దక్ష్ మాలిక్ సాధించిన ఈ ఘనత భారత యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన అవకాశం దక్ష్ భవిష్యత్తుకు బలమైన పునాది పడింది.