రుద్రాక్ష ధారణ నియమాలు ఏవి ?

Rules For Wearing Rudraksha, Rudraksha, Rudraksha Uses,Hindu Tradition,Rudraksha Dharana Rules,Rudraksha Dharana

మన హిందూ సంప్రదాయం ప్రకారం రుద్రాక్షలకు చాలా విలువనుం ఇస్తుంటాం.వాటిని మెడలో ధరించడం లేదా చేతికి కట్టుకోవడం వంటివి కూడా చేస్తుంటాం.

 Rules For Wearing Rudraksha, Rudraksha, Rudraksha Uses,hindu Tradition,rudraksha-TeluguStop.com

అయితే ఏదైనా దేవుడికి సంబంధించిన దీక్ష తీసుకున్నప్పుడు కూడా రుద్రాక్ష మాల వేస్కుంటాం.అయితే అసలు ఎలాంటి రుద్రాక్షలు వేస్కోవాలి, రుద్రాక్ష ధారణ నియమాలు ఏంటనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పుచ్చి పోయిన రుద్రాక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించ రాదు.కుల, మత భేదము లేకుండా అందరూ రుద్రాక్షలను ధరించవచ్చు.బంగారు, వెండి, రాగి తీగెలతోగాని, నూలు లేదా సిల్కు దారముతో గుచ్చి ధరించ వచ్చును.రతి సమయములో రుద్రాక్షలు పవిత్ర స్థలములో ఉంచాలి.

పొరపాటున ఆ సమయములో ధరిస్తే, ఆ తరువాత వాటిని ఆవు పాలతో శుద్ధి చేయవలెను.రుద్రాక్షలను ధరించేటపుడు “ఓం నమఃశివాయ” ఒక మాల (108సార్లు) చేయుట శుభ ప్రదము.

రుద్రాక్షలు ధరించిన వారు వాటిని ఎల్లప్పుడు పరిశుభ్రంగా వుంచి, ప్రతీ పూర్ణిమకు ఆవు పాలతో మహా మృత్యుంజయ మంత్రంతోగానీ ఓం నమః శ్శివాయ అని అంటూ అభిషేకము చేయుట చాలామంచిది.రుద్రాక్షలు ధరించిన వారు మాంసాహారం, మద్యం, పొగ త్రాగుటం మానేయడం మంచిది.

అలాగే రుద్రాక్షలు ధరించుట వలన గుండె జబ్బులు, అధిక రక్త పోటు, మధు మేహం మొదలగు దీర్ఘ కాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం.రుద్రాక్షలను అన్ని వర్ణములవారు ధరించవచ్చును.

రుద్రాక్షల్లో ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షట్ముఖి, సప్తముఖి, అష్టముఖి, నవముఖి, దశముఖి ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube