పరమ శివుని ప్రతి రూపం శివలింగం.శివ లింగంను సరైన ఆచార వ్యవహారాలతో పూజిస్తేనే మనం కోరిన వరాలను పరమ శివుడు ప్రసాదిస్తారు.
శివలింగంను పూజించినప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.లేకపోతే ఆ దేవదేవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.
శివ పురాణం ప్రకారం కొన్ని వస్తువులను శివునికి సమర్పించకూడదు.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.పసుపుపసుపును ప్రతి పూజలోను ఉపయోగిస్తాం.కానీ శివుని పూజలో మాత్రం ఉపయోగించకూడదు.ఎందుకంటే పసుపు స్త్రీల అందాన్ని పెంచే వస్తువుగా పేరు పొందింది.మరి శివలింగం పరమశివునికి ప్రతిరూపం.తులసిశివ లింగాన్ని పుజించే సమయంలో తప్పనిసరిగా తులసి ఆకులను శివునికి సమర్పణ చేయకూడదని గుర్తుంచుకోవాలి.శివునికి ఎప్పుడు బిల్వ పత్రాలతోనే అర్చన చేయాలి.
కొబ్బరి నీళ్లుశివ లింగం దగ్గర కొబ్బరికాయ కొట్టవచ్చు.కానీ కొబ్బరి నీటిని సమర్పించకూడదు.
చంపాశివలింగం పరమశివుని ప్రతిరూపం కాబట్టి ఆయనకి ఇష్టమైన తెల్లని పువ్వులను మాత్రమే శివలింగానికి సమర్పించవచ్చు.చంపా పువ్వులను మాత్రం పెట్టకూడదు.ఎందుకంటే వాటిని శివుడు శపించాడని నమ్ముతారు.
కుంకుమ తిలకంశివలింగానికి కుంకుమ తిలకం ఎప్పుడూ వాడవద్దు.
భక్తులు కానీ పార్వతీ మరియు గణేషుడి విగ్రహాలకు కుంకుమ తిలకాన్ని వాడతారు.
సమర్పించే దేన్నీ మీరు తినవద్దు లేదా తాగవద్దుభక్తులు శివలింగానికి సమర్పించే దేన్నీ తినకూడదు, తాగరాదు.
అది చెడ్డశకునాన్ని తేవటమే కాకుండా అదృష్టం,డబ్బు దూరం అవుతాయి.అంతేకాక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
జలధారఇంటిలో శివలింగాన్ని ఉంచి పూజిస్తే తప్పనిసరిగా జలధార ఉండాలని గుర్తుంచుకోండి.జలధార లేకుండా శివలింగాన్ని పూజిస్తే, అది నెగటివ్ శక్తులను ఆకర్షిస్తుంది.