123 అడుగుల ఎత్తైన శివయ్య విగ్రహం.. ఈ విశిష్ట ఆలయం రహస్యం గురించి తెలుసా..?

శివయ్యకు( Lord shiva ) ప్రత్యెక్కించిన ఈ దేవాలయం పేరు మురుడేశ్వర్.మురుడేశ్వర్ అనేది శివయ్య పేరు.

 123 Feet Tall Shiva Statue.. Do You Know The Secret Of This Unique Temple..? ,-TeluguStop.com

ఈ దేవాలయంలో ఆ మహా పరమేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఈ విగ్రహం ఎత్తు సుమారు 123 అడుగులు ఉంటుంది.

ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివుని విగ్రహం అని పండితులు చెబుతున్నారు.ఈ శివుని విగ్రహాన్ని తయారు చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది.

ఈ మహాదేవుని విగ్రహాన్ని సిద్ధం చేసేందుకు దాదాపు 5 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.

ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే పురాణాల ప్రకారం రావణుడి తపస్సుకు సంతోషించిన శివుడు అతనికి లింగాన్ని ఇచ్చాడు.నువ్వు అమరుడవ్వాలంటే దానికి దారిలో శివలింగాన్ని( Shivalingam ) పొరపాటున కూడా నేల మీద పెట్టరాదని శివుడు రావణుడితో చెప్పాడు.

కానీ గణేశుడు చాతుర్యంతో రావణుడిని లంకకు పంపి లింగాన్ని గోకర్ణం పై ఉంచేలా చేశాడు.

దానికి కోపోద్రికుడైన రావణుడు ఈ లింగాన్ని మూలాల నుంచి నాశనం చేయడానికి ప్రయత్నించాడు.ఇంతలో శివలింగాన్ని కప్పిన వస్త్రం మృడేశ్వరుని కందుక పర్వతం మీద పడింది.ప్రస్తుతం మృడేశ్వర్‌ను మురుడేశ్వర్( Murdeshwar ) అనీ పిలుస్తారు.

ఈ మురుడేశ్వర్ దేవాలయం బెంగళూరుకి 497 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఈ దేవాలయం భక్తి జ్ఞాన కేంద్రంగా వెలిసింది.

ఈ దేవాలయంలోనీ 123 అడుగులు ఎత్తైన మహా శివుడిని దర్శించుకోవడం ఆధ్యాత్మికం అని భక్తులు చెబుతూ ఉంటారు.అంతే కాకుండా ఈ దేవాలయానికి మూడు వైపులా సముద్రం ఉంటుంది.

అంతే కాకుండా ఇక్కడ సూర్యాస్తమయం, బీచ్, కొల్లూరు టెంపుల్ తప్పక చూడదగిన ప్రదేశాలు అని స్థానికులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube