123 అడుగుల ఎత్తైన శివయ్య విగ్రహం.. ఈ విశిష్ట ఆలయం రహస్యం గురించి తెలుసా..?

శివయ్యకు( Lord Shiva ) ప్రత్యెక్కించిన ఈ దేవాలయం పేరు మురుడేశ్వర్.మురుడేశ్వర్ అనేది శివయ్య పేరు.

ఈ దేవాలయంలో ఆ మహా పరమేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఈ విగ్రహం ఎత్తు సుమారు 123 అడుగులు ఉంటుంది.

ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివుని విగ్రహం అని పండితులు చెబుతున్నారు.ఈ శివుని విగ్రహాన్ని తయారు చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది.

ఈ మహాదేవుని విగ్రహాన్ని సిద్ధం చేసేందుకు దాదాపు 5 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.

"""/" / ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే పురాణాల ప్రకారం రావణుడి తపస్సుకు సంతోషించిన శివుడు అతనికి లింగాన్ని ఇచ్చాడు.

నువ్వు అమరుడవ్వాలంటే దానికి దారిలో శివలింగాన్ని( Shivalingam ) పొరపాటున కూడా నేల మీద పెట్టరాదని శివుడు రావణుడితో చెప్పాడు.

కానీ గణేశుడు చాతుర్యంతో రావణుడిని లంకకు పంపి లింగాన్ని గోకర్ణం పై ఉంచేలా చేశాడు.

"""/" / దానికి కోపోద్రికుడైన రావణుడు ఈ లింగాన్ని మూలాల నుంచి నాశనం చేయడానికి ప్రయత్నించాడు.

ఇంతలో శివలింగాన్ని కప్పిన వస్త్రం మృడేశ్వరుని కందుక పర్వతం మీద పడింది.ప్రస్తుతం మృడేశ్వర్‌ను మురుడేశ్వర్( Murdeshwar ) అనీ పిలుస్తారు.

ఈ మురుడేశ్వర్ దేవాలయం బెంగళూరుకి 497 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఈ దేవాలయం భక్తి జ్ఞాన కేంద్రంగా వెలిసింది.

ఈ దేవాలయంలోనీ 123 అడుగులు ఎత్తైన మహా శివుడిని దర్శించుకోవడం ఆధ్యాత్మికం అని భక్తులు చెబుతూ ఉంటారు.

అంతే కాకుండా ఈ దేవాలయానికి మూడు వైపులా సముద్రం ఉంటుంది.అంతే కాకుండా ఇక్కడ సూర్యాస్తమయం, బీచ్, కొల్లూరు టెంపుల్ తప్పక చూడదగిన ప్రదేశాలు అని స్థానికులు చెబుతున్నారు.