వామ్మో మహేష్ బాబు అల్లుడిని చూశారా... మామకు జిరాక్స్ కాపీలా ఉన్నాడే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మహేష్ బాబు ( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

 Have You Seen Mahesh Babu's Son-in-law ,mahesh Babu ,sudheer Babu, Tollywood, So-TeluguStop.com

మహేష్ బాబు సినిమాలలో నటన ఆయన స్మైల్, ఆయన ఆటిట్యూడ్ కి ఎవరు కూడా సాటి రారని చెప్పాలి.ఇక మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ( Gautham )ఉన్నప్పటికీ గౌతమ్ అచ్చం కృష్ణ గారి పోలికలతో ఉండడం విశేషం.

ఇలా మహేష్ బాబుని ఎవరు అనుసరించలేరని చెప్పాలి.అయితే తాజాగా మహేష్ బాబుకి పోటీగా మరొకరు రాబోతున్నారని తెలుస్తోంది.

మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని నటుడు సుధీర్ బాబు( Sudheer Babu )ల పెద్ద కుమారుడు చరిత్ మానస్( Charith Manas ) గురించి అందరికీ సుపరిచితమే.ఈ కుర్రాడు ఇదివరకు పలు సినిమాలలో బాల నటుడిగా నటించారు.అయితే తన కుమారుడిని ఇండస్ట్రీలోకి తీసుకురావడం కోసం సుదీర్ బాబు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ప్రస్తుతం చరిత్ మానస్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసినటువంటి నేటిజన్స్ అరె చరిత్ అచ్చం తన మామయ్య మహేష్ బాబుకి జిరాక్స్ కాపీలా ఉన్నారు అంటూ ఆశ్చర్యపోతున్నారు.

చరిత్ వాకింగ్ స్టైల్ మాత్రమే కాకుండా ఆయన స్మైల్ ఆటిట్యూడ్ అన్నీ కూడా మహేష్ బాబుని పోలి ఉండడంతో మహేష్ బాబుకు జిరాక్స్ కాపీ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ వీడియో కనుక చూస్తే మహేష్ బాబు టీనేజ్ లో ఉన్నదా అన్న సందేహాలు కూడా రాకమానదు.చరిత్ మానస్ ఇండస్ట్రీలోకి కనుక అడుగుపెడితే తన మామయ్య మహేష్ బాబుకి పోటీ ఇస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ప్రస్తుతం మహేష్ బాబు అల్లుడికి సంబంధించిన ఈ వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube