ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలలో టమాటా రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కిలో టమాటా 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పలుకుతుండటంతో ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుండగా సామాన్యులు మాత్రం ఒకింత ఇబ్బంది పడుతున్నారు.
గతంలో టమాటా ( Tomato )రేట్లు చాలాసార్లు పెరిగినా ఈ స్థాయిలో పెరిగిన సందర్భాలు అయితే లేవనే చెప్పాలి.
కర్ణాటక( Karnataka ) రాష్ట్రానికి చెందిన ఒక రైతు టమాటా పంట సాగు చేయడం ద్వారా జాక్ పాట్ కొట్టారు.
టమాటాలు అమ్మి ఒక్కరోజులో 38 లక్షల రూపాయలు సంపాదించారు.మిగతా రోజులలో అమ్మిన టమాటాలకు వచ్చిన డబ్బు కలిపితే టమాటాల ద్వారానే ఈ రైతు కోటీశ్వరుడు అయ్యాడని సమాచారం అందుతోంది.
ఇద్దరు రైతులు 40 ఎకరాల భూమిలో టమాటా పంటను సాగు చేయడంతో ఈ స్థాయిలో ఆదాయం దక్కింది.

ఒకప్పుడు గిట్టుబాటు ధరలు లేక టమాటాలను రోడ్లపై పారబోసిన సందర్భాలు కోకొల్లలు.ఇప్పుడు మాత్రం బంగారం కంటే టమాటాలకే విలువ ఎక్కువంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కర్ణాటకలో భేతమంగళం జిల్లాకు చెందిన ప్రభాకర్ గుప్తా( Prabhakar Gupta ), అతని సోదరుడు ఒక్కో బాక్స్ 1900 రూపాయల చొప్పున 2000 బాక్స్ లు విక్రయించి ఈ మొత్తాన్ని సొంతం చేసుకున్నారు.

రెండేళ్ల క్రితం బాక్స్ టమాటాను 800 రూపాయలకు అమ్మామని ఇప్పుడు పలికిన ధర హైయెస్ట్ అని ఆ రైతులు చెబుతున్నారు.నాణ్యమైన టమాటాను పండించడం మాకు తెలుసని టమటా పంటను తెగుళ్ల నుంచి కాపాడుకున్నామని ఆ రైతులు చెబుతున్నారు.మరి కొంతకాలం టమాటా ధరలు ఇదే విధంగా ఉంటే మాత్రం రైతులకు మరింత బెనిఫిట్ కలిగే ఛాన్స్ ఉంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం టమాటా ధరలను తగ్గించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.







