ప్రభాస్ కి కృష్ణంరాజు అన్యాయం చేయడమేంటి అని అనుకుంటున్నారు కదా ? కానీ అది నిజమే ప్రభాస్ కి కృష్ణంరాజు నిజంగానే అన్యాయం చేశారు.అయితే అది కేవలం సినిమాల విషయంలోనే.
కృష్ణంరాజు టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాల్లో నటించాడు, అలాగే ప్రభాస్ తో కూడా కొన్ని సినిమాల్లో నటించాడు.ఒకప్పుడు కృష్ణంరాజుతో మల్టి స్టారర్ సినిమా పడింది అంటే చాలు అది ఖచ్చితంగా హిట్టవుతుందని నమ్మకం ఉండేది.
అలా ఒక్క కృష్ణ తోనే ఏకంగా 17 సినిమాల్లో కలిసి నటించాడు కృష్ణంరాజు.అంతేకాదు శోభన్ బాబుతో సైతం అనేక సినిమాల్లో నటించాడు.
కానీ ప్రభాస్ కి మాత్రం ఒక్క హిట్టు కూడా ఇవ్వలేదు అందుకే తన అభిమాన హీరోకి కృష్ణంరాజు అన్యాయం చేశారు అని అంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.
ప్రభాస్ కృష్ణంరాజు కాంబినేషన్లో ఇప్పటివరకు మూడు చిత్రాలు వచ్చాయి.
ఈ మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి.కృష్ణంరాజు ,ప్రభాస్ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ప్రేక్షకుల్లో తెలియని ఉత్సాహం ఉండేది.
అందుకే వారిద్దరి కాంబినేషన్లో ఎక్కువగా సినిమాలు రావాలని అభిమానులు కోరుకునేవారు.మొదటిసారిగా 2009 సంవత్సరంలో చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు.
ఈ చిత్రంలో ప్రభాస్ మీడియా డాన్ గా, దొంగ గా రెండు పాత్రల్లో నటించగా, కృష్ణంరాజు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.కానీ ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేదు కానీ ఈ చిత్రం మాత్రం ప్రభాస్ కి మోస్ట్ స్టైలిష్ స్టార్ గా కెరియర్ లో నిలిచిపోయింది.

ఇక మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో 2012లో రెబెల్ అనే సినిమా వచ్చింది.ఈ సినిమా యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కింది.అయితే ఈ సినిమా కూడా ఘోర పరాజయం పాలైంది.యాక్షన్స్ సన్నివేషాలతో పాటు ప్రభాస్ కి మంచి మానేరిజమ్స్ లో కూడా ఈ సినిమా పరంగా మార్కులు పడ్డప్పటికీ ఈ సినిమా మాత్రం ఇద్దరికీ కలిసి రాలేదు దాంతో ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది.
ముచ్చటగా మూడోసారి ఈ ప్రభాస్ కృష్ణం రాజు కలిసి రాదే శ్యామ్ సినిమాలో నటించారు.ఈ చిత్రం ప్రభాస్ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.
దాంతో ప్రభాస్ కృష్ణంరాజుల కాంబినేషన్ వర్కౌట్ కాలేదు.అందుకే ఎంతోమంది స్టార్ హీరోలకి ఇట్స్ ఇచ్చిన కృష్ణంరాజు కొడుక్కి మాత్రం హిట్ ఇవ్వలేకపోయాడు.