అక్షింతలకు దైవ కార్యాలలోను, శుభ కార్యాలలోను ఒక ప్రముఖమైన స్థానం ఉంది.పెళ్ళిలో వధూవరుల మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు.
అలాగే చిన్న
పిల్లల వేడుకలలోను అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉండటం మనం చూస్తూనే
ఉంటాం.ఇలా అక్షింతలు ఆశీస్సులతో ముడిపడి అన్నిరకాల శుభకార్యాలలోను
ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి.
కొస విరగని బియ్యంలో పసుపు కలిపి అక్షింతలను తయారుచేస్తారు.బియ్యంలో
పసుపు కలపటం వలన పవిత్రత కలుగుతుంది.బియ్యం చంద్రుడుకి చెందిన ధాన్యం.చంద్రుడు మనస్సుకు సంబందించిన కారకుడు కావటం వలన మనస్సుపై ప్రభావము
కలుగుతుంది.
ప్రతి వారి శరీరంలోను ఒక విద్యుత్ కేంద్రం ఉంటుంది.ఆశీర్వాదం కోసం అక్షింతలను వేసినప్పుడు వారి శరీరంలోని కొంత విద్యుత్ అక్షింతల్లోకి చేరుతుంది.ఆ అక్షింతలను తలపై వేసినప్పుడు విద్యుత్ పరావర్తనం చెంది సాత్విక గుణ వర్గీకరణ జరుగుతుంది.ప్రతి మనిషిలో తల భాగంలోనే విద్యుత్ ఉత్పత్తి జరిగి అది దేహానికి ప్రసారమవుతూ వుంటుంది.
ఈ కారణంగానే తలపై అక్షింతలు వేస్తుంటారు.