ఆగ్రా లోని కలి బారి( Kalibari )లో 200 ఏళ్లకు పైగా పురాతనమైన చారిత్రాత్మకమైన కాళీ మాత దేవాలయం( Kalimata Mandir ) ఉంది.బెంగాలీలు స్థాపించిన ఏకైక దేవాలయం ఇదే అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.
ఈ మర్మమైన దేవాలయం అనేక అద్భుత సంఘటనలతో ముడిపడి ఉన్నాయి.ఈ దేవాలయ స్థాపన సమయంలో ఒక ఘాట్ దొరికిందని, ఈ ఘాట్ ఇప్పటికీ నీటితో నిండి ఉందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.
దీని ప్రత్యేకత ఏమిటంటే ఘాట్లోనీ నీరు ఎప్పుడూ తగ్గలేదని అందులో ఎలాంటి క్రిములు ఉండవని ఇక్కడి పండితులు చెబుతున్నారు.కలిబరి రహస్యమైన కాళీ దేవాలయం 200 సంవత్సరాలకు పైగా పురాతనమైనది.
అలాగే ఈ దేవాలయంలో అద్భుతాలు ఎన్నో జరిగాయి.అందుకే ఈ దేవాలయం నేటికీ రహస్యంగానే ఉంది.
బెంగాల్లో ప్లేగు( Plague ) అనే భయంకరమైన వ్యాధి వచ్చిన తర్వాత భట్టాచార్య పూర్వికులు ఆగ్రకు వచ్చి యమునా నది( Yamuna River ) ఒడ్డున నివసించారు.అప్పుడూ కాళీమాత కలలో కనిపించి, ద్వారకానాథ్‌కి తాను యమునా నది ఒడ్డున ఉన్నానని గ్రహించి, ఆ దేవాలయంలో ఇప్పటికీ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని, ఘాట్‌ని తన వెంట తెచ్చుకున్నాడు.ముఖ్యంగా చెప్పాలంటే డా.దేవాశిష్ భట్టాచార్య పూర్వీకులు యమునా నది ఒడ్డున అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు.
ఈ ఆలయం ప్రత్యేకత( Kali Bari Temple Significance ) ఏమిటంటే దాంట్లోనే నీరు ఎప్పుడు తగ్గదు.నీరు ఎప్పుడూ ఎండిపోదు.ఈ రోజు వరకు ఆ నీటిలో ఎటువంటి జీవి లేదు.ఈ దేవాలయనికి భక్తులలో ఎంతో ఆదరణ ఉంది.మాతా రాణి దేవాలయానికి ఎంతో మంది తల వంచి కోరికలు తీర్చుకునేందుకు వస్తూ ఉంటారు.ప్రతి రోజు భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటుంది.
ఈ దేవాలయంలో పూర్వకాలం మేకలను బలి ఇచ్చేవారు.కానీ ప్రజల అభ్యంతరాలు దృష్టిలో ఉంచుకొని ఈ బలిని నిలిపివేస్తున్నట్లు పండితులు చెబుతున్నారు.
ఈ రహస్యమైన దేవాలయానికి ప్రతి ఏడాది ఎంతో మంది భక్తులు దర్శనం కోసం వస్తూ ఉంటారు.
LATEST NEWS - TELUGU