మనదేశంలో చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎంతో బలంగా నమ్ముతారు.అంతేకాకుండా ఇంటిని కూడా వాస్తు ప్రకారమే నిర్మించుకుంటూ ఉంటారు.
ఇలా చేయడం వల్ల వారి జీవితంలో కష్టాలు దూరమై సుఖసంతోషాలు వస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.ముఖ్యంగా చెప్పాలంటే ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటే వాస్తు దోషాలు( Vastu doshas ) పితృ దోషాలతో పాటు గ్రహాల వల్ల కలిగే దుష్ఫలితాలు కూడా దూరమైపోతాయి.
అదే విధంగా ఇంట్లో మొక్కలు నాటడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ( Lakshmi Devi )కొన్ని మొక్కలలో నివసిస్తుందని వేద పండితులు చెబుతున్నారు.ఆ మొక్కను మీరు రక్షిస్తే ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే పారిజాత మొక్క అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం.
ఈ మొక్క యొక్క ప్రత్యేకత, నాటడానికి సరైన దిశ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.పారిజాతం( Night-flowering jasmine ) మొక్క పువ్వులు సువాసనను చుట్టూ వెదజల్లుతూ ఉంటాయి.
ఈ అద్భుతమైన మొక్కకు సంబంధించిన అద్భుతమైన పువ్వులు రాత్రి పూట మాత్రమే విరబూస్తాయి.ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించే శక్తి ఈ పారిజాత పుష్పాలకు ఉంది.ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది.
అలాగే ఇంటికి ఉత్తరం లేదా తూర్పు( East direction ) లేదా ఈశాన్య దిశలో పారిజాత మొక్క నాటడం వల్ల ఆ ఇంటికి ఎంతో మంచిది.సనాతన ధర్మం ప్రకారం ఇంట్లో పారిజాతం మొక్క ఉండడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది.