ఉల్లి ర‌సంతో సులువుగా బ‌రువు త‌గ్గొచ్చు.. తెలుసా?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా విరి విరిగా ఉప‌యోగించే ఆహార ప‌దార్థాల్లో ఉల్లిపాయ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.ఉల్లిపాయ లేనిదే చాలా కూర‌లు చేయ‌లేము.

 Onion Juice Helps To Lose Heavy Weight! Onion Juice, Lose Heavy Weight,  Heavy W-TeluguStop.com

ఒక వేళ చేసినా.ఉల్లిపాయ లేని లోటు ఖ‌చ్చితంగా ఉంటుంది.

అందుకే ఉల్లిపాయకు అంత డిమాండ్.అయితే ఉల్లిపాయ వంట‌ల‌కే కాదు.

ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూర్చ‌డంలోనూ ముందుంటుంది.ముఖ్యంగా అధిక బరువు స‌మ‌స్య‌కు ఉల్లి ర‌సంతో చెక్ పెట్ట‌వ‌చ్చు.

నేటి కాలంలో చాలా మంది అధిక బరువు స‌మ‌స్య‌ను ఫేస్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే అధిక బ‌రువు ఎలాగైనా చెక్ పెట్టాల‌ని.

ఫుల్ డైట్ ఫాలో అవ్వ‌డంతో పాటు.ర‌క‌ర‌కాల వ్యాయామాలు చేస్తుంటారు.

అయితే బ‌రువు త‌గ్గాల‌ని కోరుకునే వారికి ఉల్లి ర‌సంలో ఔష‌ధంలా ప‌ని చేస్తుంది.ఎందుకంటే, ఉల్లిపాయలో కేలరీలు, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉండ‌ట‌మే కాదు.

ఇందులో ఉండే క్వెర్‌సెటిన్’ అనే యాంటీ ఆక్సిడెంట్ మెటబాలిజం రేటు పెంచుతుంది.త‌ద్వారా అధిక బరువుకు చెక్ పెట్ట‌వ‌చ్చు.

ఇక ఉల్లి ర‌సం ఎప్పుడు తీసుకోవాలి.ఎలా తీసుకోవాలి అన్న‌ది కూడా చాలా ముఖ్యం.ముందుగా ఉల్లిపాయ నుంచి ర‌సం తీసుకోవాలి.ఆ ర‌సంలో కొద్దిగా తేనె వేసి బాగా మిక్స్ చేసుకుని.

ఉద‌యాన్నే పరగడుపున తీసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న అద‌న‌పు కొవ్వు క‌రిగింది.

అయితే ఈ ఉల్లి ర‌సాన్ని వారానికి మూడు సార్లు తీసుకుంటే స‌రిపోతుంది.అంత‌క‌న్నా ఎక్కువ తీసుకున్నా ప్ర‌మాద‌మే.

అలాగే ఈ ఉల్లి ర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, గొంతు స‌మ‌స్య‌లు ఉంటే.నివారిస్తుంది.ఉల్లి ర‌సం తీసుకోవ‌డం మ‌రో ప్ర‌యోజ‌నం ఏంటంటే.ఇన్సులిన్ స్థాయిలను పెంచ‌డంతో పాటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

ఇక ఉల్లిపాయ ర‌స‌మే కాకుండా.మ‌జ్జిగ‌లో ఉల్లిపాయను కూడా తీసుకోవ‌చ్చు.

ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అవుతున్నాయి.మ‌రియు గుండె జ‌బ్బులు రాకుండా కూడా నివారిస్తుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube