టాలీవుడ్ ఇండస్ట్రీకి( Tollywood Industry ) చెందిన నిర్మాతలకు కీలకమైన ఆదాయాలలో శాటిలైట్ ఆదాయం కూడా ఒకటనే సంగతి తెలిసిందే.గతేడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలలో దేవర( Devara ) కూడా ఒకటి.
ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో నటించగా రెండు పాత్రల్లో అద్భుతమైన నటనతో అదరగొట్టారు.ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఇప్పటికే 140 రోజులు దాటిందనే సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా శాటిలైట్ హక్కులు( Satellite rights )ఇప్పటివరకు అమ్ముడవలేదని తెలుస్తోంది.ప్రస్తుతం ఓటిటీల హవా నేపథ్యంలో సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచినా శాటిలైట్ హక్కులు అమ్ముడవని పరిస్థితి నెలకొంది.
దేవర మూవీ శాటిలైట్ రైట్స్ అమ్ముడవలేదని తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఒకింత షాకవుతున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఇలా ఉందేంటంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

పెద్ద సినిమాలకే ఇలాంటి పరిస్థితి ఉంటే మిడిల్ రేంజ్ హీరోలు, చిన్న హీరోల సినిమాలకు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దేవర సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడవని నేపథ్యంలో దేవర సీక్వెల్ కు ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడాల్సి ఉంది.ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2, ప్రశాంత్ నీల్ ( War2 )సినిమాలతో బిజీగా ఉన్నారు.ప్రశాంత్ నీల్ సినిమా ( Prashant Neel )వచ్చే వారం నుంచి మొదలుకానుంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ) గత పదేళ్లుగా వరుస హిట్లు దక్కుతున్నాయి.తారక్ నటించిన టెంపర్ సినిమా విడుదలై పదేళ్లు కాగా ఈ సినిమా నుంచి తారక్ కు సక్సెస్ ట్రాక్ మొదలైంది.జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
మార్చి నెల నుంచి తారక్ ప్రశాంత్ నీల్ మూవీ షూట్ తో బిజీ కానున్నారని తెలుస్తోంది.తారక్ ప్రశాంత్ నీల్ మూవీ బడ్జెట్ 400 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.