బాయ్స్ సినిమా గురించి, ఆ చిత్రంలో నటించిన హీరోల గురించి ఇప్పటికే చాల ఆర్టికల్స్ లో తెలుసుకున్నాం.తెలియని వాళ్ళు ఒకసారి మన సైట్ లోకి వెళ్లి చూడగలరని మనవి.
ఇక ఇప్పుడు మరొక విషయం ఏమిటి అంటే మణికందన్ బాయ్స్ సినిమాలో నటించి హీరో గా మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత వరస సినిమాల్లో చేసి పెద్ద హీరో అవుతాడు అని అంత భావించిన ఆలా జరగలేదు.
పైగా ఇప్పటికి వారికి పట్టుమని పది సినిమాల్లో కూడా మణికందన్ నటించలేదు.అస్సలు అయన కెరీర్ ఎందుకు ఇలా రివర్స్ అయ్యిందో ఈనాడు బయటకు వచ్చి చెప్పలేదు కూడా.
కానీ ఇటీవల ఒక తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మణికందన్ కి జరిగిన అనేక విషయాలు బయటపెట్టాడు.
అందులో ముఖ్యంగా ఒక పెద్ద సినిమా అవకాశం ఎలా కోల్పోవాల్సి వచ్చిందో కూడా వివరించాడు.
ఆ విషయంలోకి వెళ్తే 2013 లో మణికందన్ విజయ్ సేతుపతి హీరో గా సూదుకవ్వం అనే సినిమా లో నటించాడు.అప్పటికే విలన్ రోల్స్ కూడా చేయడం ప్రారంభించిన అవి వర్క్ అవుట్ కాకపోవడం తో నిరాశలో ఉన్న మణికందన్ సూదుకవ్వం సినిమా నిజంగా గొప్ప అవకాశమే.
ఈ సినిమా తన పాత్ర పైన చాల హోమ్ వర్క్ కూడా చేసాడట.అయితే అంతకు ముందే అదే డేట్ ని వేరే ఒక నిర్మాతకు కూడా ఇచ్చాడట.
అయితే ఆ నిర్మాత ఫారిన్ లో షూటింగ్ ఉంటుంది అని చెప్పి మణికందన్ దగ్గర పాసుపోర్టు తీసుకున్నాడట.అయితే సూదుకవ్వం సినిమా పెద్ద ప్రాజెక్ట్ కావడం తో ఆ నిర్మాత దగ్గరకు వెళ్లి అడిగాడట.
తనకు ఎలాగైనా సినిమా నుంచి రిలీవ్ చేయాలనీ అడిగిన సదరు నిర్మాత అస్సలు ఒప్పుకోలేదట.ఆలా మొత్తానికి సూదుకవ్వం సినిమా నుంచి బయటకు రావాల్సి వచ్చిందట.కానీ అంతకు ముందు పాస్ పోర్ట్ తీసుకున్న ఆ నిర్మాత చివరికి ఆ సినిమా తీయను లేదు.మణికందన్ ని ఫారిన్ ని తీసుకెళ్ళాను లేదు.ఆలా రెండు సినిమాల్లో పని చేయకుండా తప్పవుకోవాల్సి వచ్చిందట.మొత్తానికి ఇలా పలు రకాల కారణాలతో మణికందన్ చివరి వరకు స్టార్ అవ్వకుండానే మిగిలిపోతున్నాడు.