ఉల్లిపాయ.అందరి ఇళ్లల్లోనూ నిత్యం వాడే కూరగాయ ఇది.రోజూవారీ వంటలను ఉల్లిపాయ లేకుండా చేయడం అంటే ఆసాధ్యమనే అంటారు.అలాగే ఘాటైన రుచి, ప్రత్యేకమైన వాసన కలిగి ఉండే ఉల్లిపాయల్లో పోషకాలు కూడా మెండుగా నిండి ఉంటాయి.
అందుకే ఆరోగ్య పరంగా, సౌందర్య పరంగా ఉల్లిపాయలు ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయి.అయితే ఒక్కోసారి ఉల్లియాల నుంచి మొలకలు వస్తుంటాయి.అలా మొలకెత్తిన ఉల్లిపాయలను కొందరు వాడేస్తుంటారు.కొందరు మాత్రం బయట పారేస్తుంటారు.
అసలింతకీ మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా.? తినకూడదా.? అంటే ఆరోగ్య నిపుణులు తినమనే చెబుతున్నారు.అలాగే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మొలకెత్తిన ఉల్లిపాయలను తింటే మన శరీరానికి అపారమైన లాభాలు లభిస్తాయి.
మరి ఆ లాభాలు ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
మొలకెత్తిన ఉల్లిపాయల్లో కాల్షియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
అందువల్ల, వీటిని తీసుకున్నట్లైతే ఎముకలు, దంతాలు స్ట్రోంగ్‌గా, ఆరోగ్యవంతంగా మారతాయి.అలాగే ప్రస్తుత వేసవి కాలంలో అధిక వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరచడంలోనూ మొలకెత్తిన ఉల్లిపాయలు ఉపయోగపడతాయి.
అందుకోసం వీటిని సలాడ్స్ రూపంలో లేదా మజ్జిగతో కలిపి తీసుకోవాలి.

మొలకెత్తిన ఉల్లిపాయల్లో విటమిన్ సి మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా నిండి ఉంటాయి.కాబట్టి, వీటిని డైట్‌లో చేర్చుకుంటే రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
అంతే కాదు, మొలకెత్తిన ఉల్లిపాయలను తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్య వంతంగా మారుతుంది.
ఆస్తమా వ్యాధి అదుపులో ఉంటుంది.మరియు మూత్రకోశ వ్యాధులు సైతం దూరం అవుతాయి.
కాబట్టి, ఇకపై మొలకెత్తిన ఉల్లిపాయలను పారేయకుండా తినేస్తే పైన చెప్పిన ప్రయోజనాలన్నీ మీ సొంతం చేసుకోవచ్చు.







