అవిసె గింజలు.( Flax Seeds ) ఇటీవల కాలంలో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి.
ఆరోగ్యానికి అవిసె గింజలు ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు చెప్పడంతో చాలామంది వాటిని ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.అవిసె గింజల్లో మంచి మొత్తంలో ప్రోటీన్, డైటరీ ఫైబర్ నిండి ఉంటాయి.
ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలకు మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు అవిసె గింజలు గొప్ప మూలం.అందువల్ల ఆరోగ్యానికి అవిసె గింజలు ఎంతో మేలు చేస్తాయి.
ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.
ముఖ్యంగా ఓవర్ వెయిట్ తో( Over Weight ) వర్రీ అవుతున్న వారికి అవిసె గింజలు ఒక వరం అని చెప్పుకోవచ్చు.
అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి అవిసె గింజలు చాలా అద్భుతంగా తోడ్పడతాయి.అయితే బరువు తగ్గాలనుకుంటున్న వారు అవిసె గింజలను ఏ విధంగా తీసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం చాలామంది టీ, కాఫీ వంటి పానీయాలు తాగుతూ ఉంటారు.అయితే వాటికి బదులుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి, పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి,( Cinnamon ) రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon Juice ) కలిపి తీసుకోవాలి.ఈ డ్రింక్ మెటబాలిజం రేటును పెంచుతుంది.
శరీరంలో అదనపు కొవ్వును కరిగిస్తుంది.వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.
బరువు తగ్గాలనుకుంటున్న వారికి ఇది ఉత్తమమైన డ్రింక్ గా చెప్పుకోవచ్చు.

అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత పెరుగు తీసుకునే అలవాటు దాదాపు అందరికీ ఉంటుంది.అయితే పెరుగు( Curd ) నేరుగా కాకుండా అందులో అవిసె గింజల పొడిని కలిపి తీసుకోండి.ఒక కప్పు పెరుగుకు వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి కలిపి తింటే కడుపు ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంటుంది.
అతి ఆకలి దూరం అవుతుంది.చిరుతిళ్లపై మనసు మళ్లకుండా ఉంటుంది.దాంతో తినడం తగ్గిస్తారు.ఫలితంగా బరువు తగ్గుతారు.
ఇక ఒక స్పూన్ అవిసె గింజలను ఒక గ్లాస్ వాటర్ లో వేసి నైట్ అంతా నానబెట్టాలి.ఉదయాన్నే అవిసె గింజలతో సహా ఆ వాటర్ ను తీసుకోవాలి.
ప్రతినిత్యం ఈ విధంగా చేసినా కూడా బరువు తగ్గుతారు.అదే సమయంలో జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
మలబద్దకం నుండి ఉపశమనం పొందుతారు.అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అవిసె గింజలు మధుమేహం ఉన్న వ్యక్తులలో ఇన్సులిన్ సెన్సిటివిటీ మరియు బ్లడ్ షుగర్ నియంత్రణను మెరుగుపరచడంలో సైతం హెల్ప్ చేస్తాయి.