నైట్ డిన్నర్ తర్వాత ఈ నియమాలు పాటిస్తే సులభంగా బరువు తగ్గొచ్చు!

ప్రస్తుత రోజుల్లో ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, శరీరానికి శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల ఎంతో మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.ఓవర్ వెయిట్( Overweight ) అనేది అనేక రోగాలకు మూలం.

 If You Follow These Rules After Night Dinner You Can Lose Weight Easily! Weight-TeluguStop.com

అందుకే పెరిగిన బరువును తగ్గించుకునేందుకు చాలా మంది తపన పడుతూ ఉంటారు.అయితే నైట్ డిన్నర్ తర్వాత ఇప్పుడు చెప్పబోయే నియమాలు పాటిస్తే సులభంగా మీరు బరువు తగ్గొచ్చు.

Telugu Bedtime Tea, Tips, Latest-Telugu Health

ప్రతిరోజు రాత్రి భోజనం ఒకే సమయంలో చేయడానికి ప్రయత్నించాలి.ముఖ్యంగా ఏడు గంటల లోపు డిన్నర్ ను ముగించాలి.నిర్దిష్టమైన సమయంలో భోజనం చేయడం అలవాటు చేసుకుంటే జీవక్రియ పెరుగుతుంది.దాంతో మీరు బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది.అలాగే నైట్ డిన్నర్ చేసిన వెంటనే నిద్రపోయే అలవాటు చాలా మందికి ఉంటుంది.కానీ వెయిట్ లాస్ కావాలనుకునేవారు ఈ అలవాటును తప్పకుండా వదిలేయండి.

డిన్నర్ చేసిన వెంటనే నిద్రపోతే బరువు తగ్గడం కాదు పెరుగుతారు.నైట్ భోజనం తర్వాత నడక ఎంతో మంచిది.

కాసేపు అలా టెర్రస్ పైకి వెళ్లి ప్రశాంతంగా 15 నుంచి 20 నిమిషాల పాటు వాకింగ్ చేశారంటే సులభంగా బరువు తగ్గుతారు.ఒత్తిడి, టెన్షన్స్ దూరం అవుతాయి.

మంచి నిద్ర పడుతుంది.

Telugu Bedtime Tea, Tips, Latest-Telugu Health

ఇక బరువు తగ్గాలి అని భావిస్తున్న వారికి ఇప్పుడు చెప్పబోయే టీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక అంగుళం దాల్చిన చెక్క, వన్ టేబుల్ స్పూన్ సోంపు ( Anise )వేసి పది నిమిషాల పాటు మరిగిస్తే మన టీ అనేది రెడీ అవుతుంది.

ఈ హెర్బల్ టీను ఫిల్టర్ చేసుకుని డిన్నర్ ముగించిన అరగంట లేదా గంట తర్వాత తీసుకోవాలి.ఈ బెడ్‌ టైమ్‌ టీ వెయిట్‌ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.

పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలకు సైతం చెక్ చేయబడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube