బట్టతల( Bald ).ప్రస్తుత రోజుల్లో ఎంతోమంది మగవారిని కలవరపెడుతున్న సమస్య.
వంశపారంపర్యత, వృద్ధాప్యం, హార్మోన్ల మార్పులు, అధిక ఒత్తిడి, పోషకాల కొరత, కొన్ని వైద్య పరిస్థితుల కారణంగా బట్టతల ఏర్పడవచ్చు.పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు పెరగడం లేదా తగ్గడం వల్ల కూడా బట్టతల వస్తుంది.
దాంతో బట్టతల సమస్యను దూరం చేసుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.అయితే బట్టతలపై కూడా జుట్టును మొలిపించే బెస్ట్ హెయిర్ టానిక్ ఒకటి ఉంది.
ఆ టానిక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎండిన ఉసిరికాయ ముక్కలు( Dried amla pieces ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్ ( Kalonji Seeds )మరియు వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ) వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి కాఫీ పౌడర్, ఉసిరికాయ, కలోంజి సీడ్స్ నానబెట్టుకున్న గిన్నెను పెట్టి ఉడికించాలి.
దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.పూర్తిగా చల్లారాక ఉడికించిన మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని ఒక స్ప్రే బాటిల్ లో నింపుకుంటే మన హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.

ఈ టానిక్ ను స్కాల్ప్ కు ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకుని మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి తలస్నానం చేయాలి.వారానికి రెండుసార్లు ఈ టానిక్ ను వాడటం అలవాటు చేసుకుంటే తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.బట్టతలపై జుట్టు మొలవడం స్టార్ట్ అవుతుంది.ఆడవారు కూడా ఈ హెయిర్ టానిక్ ను ఉపయోగించవచ్చు.
తద్వారా జుట్టు రాలడం, విరగడం వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి.చుండ్రు సంపూర్ణంగా దూరమవుతుంది.
మరియు జుట్టు త్వరగా తెల్లబడకుండా సైతం ఉంటుంది.







