బెంగళూరులో (Bengaluru)సోమవారం రాత్రి ఓ వ్యక్తి క్యాబ్ బుక్ చేసుకుంటుండగా చిత్రమైన సంఘటన జరిగింది.రైడ్-హెయిలింగ్ యాప్ (Ride-hailing app)ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్న అతడికి ఎవరికీ ఎదురుకాకూడని పరిస్థితి ఎదురయ్యింది.
అసలేం జరిగిందంటే… డ్రైవర్ రైడ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకుండానే ప్రయాణికుడికి ఒక మెసేజ్ పెట్టాడు.తన మొబైల్‌లో “ఛార్జింగ్ అయిపోయింది” అని, వెంటనే తన అకౌంట్‌లోకి రూ.170 ట్రాన్స్‌ఫర్ చేయమని అడిగాడు.రైడర్ మాటలు నమ్మిన ఆ ప్రయాణికుడు ఏ మాత్రం ఆలోచించకుండా డబ్బులు పంపేశాడు.
డబ్బులు వెళ్లిన వెంటనే డ్రైవర్ చేసిన పనికి ఆ ప్రయాణికుడు షాకయ్యాడు.ట్రాన్సాక్షన్ పూర్తవ్వగానే డ్రైవర్ అక్కడి నుంచి జంప్ అయ్యాడు.దీంతో ఆ ప్రయాణికుడు నిండా మునిగాడు.రోడ్డుపై ఒంటరిగా మిగిలిపోయాడు.తర్వాత జరిగిన దాని గురించి ఆ ప్రయాణికుడు మాట్లాడుతూ… రైడ్ కన్ఫర్మ్ (Ride Confirm)కాకముందే డబ్బులు పంపడం తన తప్పే అని ఒప్పుకున్నాడు.“ఇది నాకు గుణపాఠం” అని వాపోయాడు.అయితే అదృష్టవశాత్తూ రైడ్-హెయిలింగ్ యాప్ కస్టమర్ సర్వీస్ టీమ్(Ride-hailing app customer service team) వెంటనే స్పందించింది.బాధితుడికి రూ.170 రీఫండ్ చేసింది.

రైడర్ తనను తాను సమర్థించుకుంటూ… పేమెంట్ అడగడానికి ముందే రైడ్ యాక్సెప్ట్ చేయాలనే విషయం తనకు తెలీదని చెప్పాడు.అయితే ప్రయాణికుడు మాత్రం ఊరుకోలేదు.రైడర్ ను వదిలిపెట్టకూడదని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.“ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఫైర్ అయ్యాడు.ఈ స్టోరీపై రెడిట్ యూజర్లు భిన్నంగా స్పందించారు.కొందరు ప్రయాణికుడికి మద్దతుగా కామెంట్స్ చేస్తే… మరికొందరు అతడిని తప్పుబడుతూ కామెంట్స్ చేశారు.“నోటెడ్ బ్రో.నెక్స్ట్ టైమ్ క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.

మరో యూజర్ మాత్రం కాస్త ఘాటుగా స్పందించాడు.“ఇది యాప్ చేసిన స్కామ్ కాదు.ఒక్క రైడర్ చేసిన మోసం అంతే.
ముందు డబ్బులు పే చేయడం ప్రయాణికుడు చేసిన పెద్ద తప్పు.మోసగాళ్లు ఎప్పుడూ ఉంటారు.
మనం అలెర్ట్‌గా ఉండాలి అంతే” అని కామెంట్ పెట్టాడు.ఏది ఏమైనా ఈ ఘటన రైడ్-హెయిలింగ్ యాప్స్ యూజర్లు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తుంది.
లేకపోతే ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి.