ప్రసవం అనంతరం ప్రతి మహిళా సర్వ సాధారణంగా ఫేస్ చేసే సమస్యల్లో హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది ముందు వరుసలో ఉంటుంది.వాస్తవానికి డెలివరీ ( Delivery ) తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం ప్రారంభమవుతుంది.
ఈ కారణంగానే జుట్టు అధికంగా రాలుతుంటుంది.అలాగే కంటినిండా నిద్ర లేకపోవడం, పోషకాల కొరత, ఒత్తిడి, పలు రకాల మందుల వాడకం వంటి అంశాలు కూడా హెయిర్ ఫాల్ కి కారణం అవుతుంటాయి.
మీకు కూడా ప్రసవం అనంతరం జుట్టు విపరీతంగా రాలుతుందా.? అయితే చింతించకండి.ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని పాటిస్తే చాలా సులభంగా హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె,( Coconut oil ) ఐదు రెబ్బల కరివేపాకు వేసుకుని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నైట్ అంతా నానబెట్టుకున్న మెంతులు వేసుకోవాలి.అలాగే వేయించుకున్న కరివేపాకు ఆయిల్ తో సహా వేసుకోవాలి.

చివరిగా అరకప్పు ఫ్రెష్ అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారంలో కేవలం ఒకే ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది.ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి.దాంతో జుట్టు ఊడటం తగ్గుముఖం పట్టి ఒత్తుగా పెరగడం ప్రారంభం అవుతుంది.
పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల చుండ్రు సమస్య ఉన్న సరే దూరమవుతుంది.కాబట్టి ప్రసవం తర్వాత జుట్టు విపరీతంగా రాలిపోతుందని సతమతం అవుతున్న మహిళలు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.
సులభంగా హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టండి.
