Flute : ఇంట్లో వేణువు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా..?

వేణువు( Flute ) అన్న వేణువు గానం అన్న శ్రీకృష్ణ పరమాత్మునికి ఎంతో ప్రీతికరమైనది.చిన్ని కృష్ణుడు ఎక్కడ చూసినా చేతిలో వేణువు పట్టుకునే కనిపిస్తాడు .

 Vastu Tips Benefits Of Keeping Flute At Home-TeluguStop.com

అలాంటి వేణువుకు వాస్తు శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.వాస్తు ప్రకారం ఇంట్లో వేణువును ఉంచడం వలన ఇంటికి సానుకూల శక్తి( Positive Energy ) వస్తుందని అలాగే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.

అంతేకాకుండా ఇంట్లో, ఆనందం, శాంతి, శ్రేయస్సు నెలకొంటాయి అని కూడా చెబుతున్నారు.ఇంట్లో వేణువు ఉండడం వలన నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా చేస్తుందని నమ్ముతారు.అలాగే వేణు ఇంట్లో ఉంటే శ్రీకృష్ణుడి ( Sri Krishna ) ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉంటాయని నమ్ముతారు.

Telugu Bamboo Flute, Benefits Flute, Flute, Energy, Sri Krishna, Vastu Tips-Late

మరి అలాంటి వేణువు ఇంట్లో ఉంచుకోవడం వలన మరిన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.వెదురుతో చేసిన వేణువును( Bamboo Flute ) ఇంట్లో ఉంచడం వలన పేదరికం తొలగిపోతుంది.

అలాగే ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయి.అంతేకాకుండా కుటుంబంలో కలతలు కూడా తొలగిపోతాయి.

భార్యాభర్తల వైవాహిక జీవితంలో ఒత్తిడిలు తొలగిపోతాయి.ఇంట్లో వేణువును ఉంచడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది.

కుటుంబ సభ్యుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది.ఏదైనా జబ్బు మిమ్మల్ని చాలాకాలంగా వేధిస్తున్నట్లయితే లేదా ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, పూర్తిగా కోలుకోకపోతే ఇంట్లో వేణువును ఉంచడం మంచిది.

Telugu Bamboo Flute, Benefits Flute, Flute, Energy, Sri Krishna, Vastu Tips-Late

ఇంట్లో వేణువును ఉంచడం వలన అనారోగ్యం పాలైన వారు త్వరగా కోలుకుంటారు.ఇంట్లో వేణువును ఉంచడం వలన చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనిని( Pending Works ) పూర్తి చేయడంలో సహాయపడుతుంది.వేణువు చేతిలో కదిలించినప్పుడు ప్రతికూల శక్తి అంత ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోతుంది.వేణువు ఇంట్లో ఉంచడం వలన నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు.ఇంట్లో వేణువు ఉంటే వ్యాపారంలో( Business ) ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube