అచ్చం మనిషిలాగే ఉన్నాడు.. ఫ్లోరిడా ఎయిర్‌పోర్ట్‌లో నిద్రపోతున్న విగ్రహం చూస్తే గుండె గుభేల్!

విమానాశ్రయాలు అంటే ఒకప్పుడు విమానాలు ఎక్కే, దిగే చోటు మాత్రమే.కానీ ఇప్పుడు అవి అందంగా డిజైన్ చేసిన ప్రదేశాలుగా మారిపోయాయి.

 Florida Airport Has A Hyper Realistic Sleeping Traveller Statue Video Viral Deta-TeluguStop.com

ప్రయాణం చేసేవాళ్లకి మంచి అనుభూతి కలిగేలా వాటిని తీర్చిదిద్దుతున్నారు.చాలా ఎయిర్‌పోర్టుల్లో ఇప్పుడు మోడ్రన్ ఇంటీరియర్స్, కళ్లు చెదిరే ఆర్ట్ ఇన్‌స్టాలేషన్స్, లోపల గార్డెన్స్, డిజిటల్ డిస్‌ప్లేలు దర్శనమిస్తున్నాయి.

ఇవన్నీ ప్రయాణికులకు ఆహ్లాదకరమైన, చూడగానే నచ్చే వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి.

ఇలాంటి వాటిల్లో ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ వైరల్ గా మారింది.

అదే ఒర్లాండో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.( Orlando International Airport ) ఇక్కడ “ది ట్రావెలర్”( The Traveler ) (లేదా “ది స్లీపింగ్ మ్యాన్” అని కూడా అంటారు) అనే ఒక రియాలిస్టిక్ శిల్పం( Realistic sculpture ) ఉంది.

దీన్ని డుయానే హాన్సన్( Duane Hanson ) అనే ఆర్టిస్ట్ క్రియేట్ చేశారు.ఈ ఆర్ట్‌వర్క్ దశాబ్దాలుగా విజిటర్స్‌ని ఆశ్చర్యపరుస్తోంది.

రీసెంట్‌గా ఒక ప్యాసింజర్ ఈ విగ్రహం వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.ఆ వీడియోలో దీని డీటెయిల్స్ చూస్తే షాక్ అవుతారు.

“ది ట్రావెలర్” విగ్రహాన్ని మెయిన్ టెర్మినల్ లెవెల్ 3లో ఒక గ్లాస్ కేస్‌లో పెట్టారు.ఇది ఒక మనిషి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు ఉంటుంది.ఆయన చేతికి వాచ్ కూడా ఉంది, అది టిక్ టిక్ మంటూ తిరుగుతూ ఉంటుంది.బరువైన లగేజీలు మోస్తూ, సరిగ్గా నిద్ర కూడా పోకుండా అలసిపోయిన ప్రయాణికుల పరిస్థితిని ఈ శిల్పం కళ్లకు కడుతుంది.

దీన్ని బ్రోంజ్‌తో తయారు చేసి ఆయిల్ పెయింట్‌తో ఫినిషింగ్ ఇచ్చారు.ఆ మనిషి కాళ్ల మీద రియలిస్టిక్ గా గాయాలు కూడా ఉంటాయి, అంటే అంత డీటెయిల్డ్‌గా దీన్ని చెక్కారు.

ఈ ఆర్ట్‌వర్క్‌ని 1985లో ఓపెన్ చేశారు.ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ శిల్పం కోసం మోడల్‌గా పోజులిచ్చిన వ్యక్తి, అది పూర్తయిన వెంటనే మాయమైపోయాడు.అప్పటినుంచి చాలామంది దీన్ని చూసి “అసలు అతను నిజమైన మనిషా? కాదా” అని అనుకుంటున్నారు.ఆ వీడియో క్యాప్షన్‌లో “నన్ను వింతగా ఫీల్ అయ్యేలా చేసే ఆర్ట్ అంటే నాకు ఇష్టం” అని రాశారు.

ఈ క్లిప్ వైరల్ అయిపోయింది.ఏకంగా 2 కోట్ల వ్యూస్ వచ్చాయి.చాలామంది యూజర్స్ రకరకాల కామెంట్స్ పెట్టారు.“ఇది చూడటానికి ఇంప్రెసివ్‌గా ఉంది కానీ కొంచెం భయానకంగా కూడా ఉంది.” అని ఒకరు అన్నారు.“ఒకవేళ అతను నిజంగానే బాగా రిలాక్స్ అవుతున్న వ్యక్తి అయితే?” అని మరొకరు కామెంట్ చేయగా.“ఒక్కసారిగా అతని కళ్లు తెరిస్తే ఎలా ఉంటుంది ఊహించుకోండి, ప్యాంట్స్ తడిపేసుకుంటాం కదా” అని ఇంకొకరు సరదాగా అన్నారు.“ఇది మరీ ఎక్కువ రియల్‌గా ఉంది.నాకు నచ్చలేదు.” ఇంకొకరు బుంగమూతి పెట్టుకున్నారు.ఈ ఇంట్రెస్టింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube