వారంలో ఒక్కసారి ఈ విధంగా షాంపూ చేసుకుంటే జుట్టు ఒత్తుగా సిల్కీ గా మారుతుంది!

Shampoo Like This Once A Week And Your Hair Will Become Thick And Silky! Thick Hair, Silky Hair, Hair Care, Hair Care Tips, Stop Hair Fall, Hair Fall, Shampooing, Flax Seeds, Rice

ఒత్తయిన సిల్కీ హెయిర్ కావాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు.కానీ, కాలుష్య వాతావ‌ర‌ణం, ఆహారపు అలవాట్లు, రసాయనాలు అధికంగా ఉండే షాంపూలను వాడటం, పోషకాల కొరత త‌దిత‌ర‌ అంశాల కారణంగా హెయిర్ ఫాల్, డ్రై హెయిర్ వంటి సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు.

 Shampoo Like This Once A Week And Your Hair Will Become Thick And Silky! Thick H-TeluguStop.com

అయితే ఇప్పుడు చెప్పబోయే విధంగా షాంపూ చేసుకుంటే ఈ సమస్యలకు సులభంగా చెక్ పెట్ట‌వ‌చ్చు.అలాగే ఒత్తయిన సిల్కీ కురులను తమ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా షాంపూ చేసుకుంటే జుట్టు ఒత్తుగా, సిల్కీగా మారుతుందో తెలుసుకుందాం పదండి.

Telugu Flax Seeds, Care, Care Tips, Fall, Silky, Thick-Telugu Health Tips

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, రెండు టేబుల్ స్పూన్లు వైట్ రైస్ వేసుకుని వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.ఆపై ఒక గ్లాస్‌ వాటర్ పోసి గంట పాటు నానపెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నాన‌బెట్టుకున్న అవిసె గింజలు, బియ్యాన్ని వాటర్ తో సహా వేసుకోవాలి.

Telugu Flax Seeds, Care, Care Tips, Fall, Silky, Thick-Telugu Health Tips

అలాగే మరో గ్లాస్ వాటర్ పోసి కనీసం ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఉడికించిన మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జెల్లీ మిశ్రమాన్ని సపరేట్ చేసుకోవాలి.ఈ జెల్ కు మూడు టేబుల్ స్పూన్లు మైల్డ్ షాంపూ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని యూస్ చేసి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారంలో ఒక్కసారి ఈ విధంగా షాంపూ చేసుకుంటే అవిసె గింజలు మరియు వైట్ రైస్ లో ఉండే ప్రత్యేక గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.అలాగే కురులను సిల్కీగా సాఫ్ట్ గా మారుస్తాయి.

కాబ‌ట్టి, త‌మ‌ జుట్టు ఒత్తుగా సిల్కీ గా మారాలని కోరుకునేవారు తప్పకుండా పైన చెప్పిన విధంగా షాంపూ చేసుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube