రోడ్డుపై పిల్లలతో వెళ్తున్నారా. అయితే ఈ వీడియో మీ కళ్ళు తెరిపిస్తుంది.
క్షణాల్లో జరిగే ప్రమాదాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ వీడియో చూస్తే మీ గుండెలు గుభేల్ అనాల్సిందే.తల్లిదండ్రుల చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతటి విషాదాన్ని మిగుల్చుతుందో కళ్లకు కట్టినట్టు చూపిస్తూ, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్( TGSRTC MD Sajjanar ) షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలతో ద్విచక్ర వాహనంపై రోడ్డు మీదకు వచ్చాడు.తండ్రి స్కూటర్( Scooter ) సైడ్ కి తీసి పార్కింగ్ చేశాడు.
అలా చేయగానే ముందు సీట్లో కూర్చున్న చిన్నారి ఒక్కసారిగా కిందకు దిగిపోయాడు.ఆడుకుంటూ రోడ్డు మధ్యలోకి వెళ్లిపోయాడు.
సరిగ్గా అదే సమయంలో దూసుకొచ్చింది డీసీఎం లారీ,( DCM Lorry ) ఒక్క క్షణం ఆలస్యమైతే ఆ పిల్లాడిని నుజ్జునుజ్జు చేసేసేది.
లారీ వేగంగా వస్తుండటం చూసి తండ్రి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.వెంటనే పిల్లాడిని వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు.కానీ పిల్లాడి చేయి జారిపోయింది.
అయినా ఆ బుడ్డోడు ఏ మాత్రం భయపడకుండా లారీకి కొంచెం దూరంలో ఆగడం అందర్నీ ఊపిరి బిగపట్టుకునేలా చేసింది.లారీ దూసుకెళ్తున్నా.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెనక్కి తిరిగి వచ్చాడు ఆ చిన్నారి.
లారీ వెళ్లి పోయాక గానీ తండ్రికి ప్రాణం కుదుటపడలేదు.ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది అతనికి.పిల్లాడు క్షేమంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.పిల్లల్ని రోడ్డుపై నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.
“అదృష్టవంతుడు.రెప్పపాటులో బయటపడ్డాడు, చిన్నారులను రహదారుల వెంట తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి.నిర్లక్ష్యం ప్రాణాంతకం కావచ్చు.అందరికీ ఈ బుడ్డోడిలా అదృష్టం వరించదు.” అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.ఈ వీడియో ప్రతి ఒక్క తల్లిదండ్రి కళ్లు తెరిపించేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పిల్లల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.