ముఖ చర్మం (Skin)తెల్లగా నిగారింపుగా కనిపించాలని చాలా మంది ఆరాటపడుతుంటారు.అటువంటి స్కిన్ కోసం ఖరీదైన ఉత్పత్తులను వాడుతుంటారు.
నెలకు ఒకసారైనా బ్యూటీ పార్లర్ కు వెళ్లి వేలకు వేలు వదిలిస్తుంటారు.కానీ రూపాయి ఖర్చు లేకుండా మన వంటింట్లో ఉండే పదార్థాలతోనే చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ సూపర్ గా వర్కోట్ అవుతుంది.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం(Rice) వేసి వాటర్ తో ఒకసారి వాష్ చేయాలి.ఆపై అరకప్పు వాటర్ పోసి నైట్ అంతా బియ్యాన్ని నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి(Sandalwood powder)(Sandalwood powder), వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు బియ్యం నానబెట్టుకున్న వాటర్, రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ బీట్ రూట్ జ్యూస్ (Beetroot Juice)మరియు వన్ టీ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ సూపర్ రెమిడీని పాటిస్తే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

ప్రధానంగా బీట్‌రూట్‌లోని విటమిన్ సి చర్మంపై నిగారింపు పెంచి, సహజమైన గ్లోను అందిస్తుంది.అలాగే రైస్ వాటర్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి ముడతలను, ఫైన్ లైన్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి.చందనం పొడి చర్మాన్ని తెల్లగా, ఆరోగ్యంగా మారుస్తుంది.బియ్యం పిండి చర్మంపై పేరుకుపోయిన మురికి మృతకణాలను తొలగిస్తుంది.తేనె సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేసి పొడిబారిన చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది.మొత్తంగా ఈ రెమెడీతో మీ ముఖ చర్మం సూపర్ వైట్ గా, బ్రైట్ గా మెరిసిపోతుంది.







