దుబాయ్ హోటల్‌లో ఇండియన్ కోటీశ్వరుడి వింత చేష్ట.. సిగ్గులేదా అంటూ నెటిజన్లు ఫైర్!

దుబాయ్‌లోని ఫైవ్ స్టార్ తాజ్ హోటల్‌లో( five star Taj Hotel in Dubai ) ఎన్నారై వ్యాపారవేత్త పీజే సింగ్‌కి ( PJ Singh )అదిరిపోయే లగ్జరీ ఎక్స్‌పీరియన్స్ ఎదురైంది.ఆయన ఆ హోటల్‌లో బస చేసి, ఫస్ట్ టైం లగ్జరీ బట్లర్ సర్వీస్‌ని ట్రై చేయాలని ఫిక్స్ అయ్యారు.ఒక వీడియోలో పీజే సింగ్ తానే స్వయంగా హోటల్ ఫ్రంట్ డెస్క్ కి ఫోన్ చేశారు.“నా సూట్ కేసు సర్దడానికి ఎవరైనా వస్తారా?” అని అడిగారు.“తప్పకుండా సర్, ఇప్పుడే ఒకరిని పంపిస్తాం” అంటూ హోటల్ సిబ్బంది సూపర్ పొలైట్ గా రెస్పాండ్ అయ్యారు.క్షణాల్లో ఒక హోటల్ బట్లర్ ఆయన రూమ్ డోర్ ముందు ప్రత్యక్షం.“మీకు ఎలా సర్వ్ చేయమంటారు సర్?” అని అడిగారు బట్లర్.అంతే, పీజే సింగ్ తన గదిని చూపించారు.

 Netizens Are On Fire Saying That The Indian Millionaire's Strange Behavior In Du-TeluguStop.com

ఎక్కడ పడితే అక్కడ బట్టలు చిందరవందరగా పడి ఉన్నాయి.ఇక బట్లర్ తన పని మొదలుపెట్టారు.

ఒక్కొక్కటి నీట్‌గా సర్దడం స్టార్ట్ చేశారు.

బట్లర్ సూట్ కేసు సర్దుతుంటే, పీజే సింగ్ మాత్రం కూల్‌గా రిలాక్స్ అవుతూ కూర్చున్నారు.స్టాఫ్ స్కిల్స్ ని చూసి ఫిదా అయిపోయి, “వావ్, ఎంత బాగా చేస్తున్నారో చూడండి.సూపర్ మీరే నిజమైన మనిషి” అంటూ తెగ పొగిడేశారు.బట్లర్ సిబ్బంది సింపుల్ గా నవ్వుతూ థాంక్స్ చెప్పారు.“5-స్టార్ హోటల్స్ ఎందుకు ఎప్పుడూ బెస్ట్ అంటే ఇదే రీజన్” అంటూ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు పీజే సింగ్.ఈ వీడియో చూసిన చాలా మంది “వావ్, ఏం సర్వీస్ ఇది” అంటూ ఫిదా అయిపోయారు.“ప్రపంచంలో ఇది చాలా అవసరమైన సర్వీస్” అని ఒక యూజర్ కామెంట్ చేస్తే, “తాజ్ హోటల్ అంటే ఫైవ్ స్టార్‌కి మించింది” అని ఇంకొకరు పొగిడేశారు.

అయితే, కొంతమంది మాత్రం పీజే సింగ్‌ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.సూట్ కేసు సర్దుకోవడం కూడా చేతకాదా? అంటూ కామెంట్స్ పెట్టారు.” సొంత సూట్ కేసు సర్దుకోలేని వాళ్లా మీరు? డబ్బుంటే క్లాస్ రాదు.సిగ్గుండాలి” అని ఒక నెటిజన్ ఫైర్ అయ్యారు.“నాకు ఈ సర్వీస్ ఉన్నా, ఎవరితోనూ చేయించుకోవడానికి కంఫర్ట్ గా ఫీల్ అవ్వను.నేనే హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాను” అని ఇంకొకరు కామెంట్ చేశారు.

మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ కి దారితీసింది.లగ్జరీని కొందరు మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం దీని అవసరమేంటి అని క్వశ్చన్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube