దక్షిణ కొరియాలో( South Korea ) ఓ బ్యాంకు దోపిడీ యత్నం అందరినీ షాక్‌కి గురిచేసింది.కారణం ఏంటంటే, దొంగ వాడింది డైనోసార్ బొమ్మ తుపాకీ.ఫిబ్రవరి 10న బుసాన్‌లోని గిజాంగ్-గున్‌లో( Gijang-gun, Busan ) జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.30 ఏళ్ల వయసున్న ఆ దొంగ టోపీ, స్కార్ఫ్‌తో ముఖం కప్పుకుని హడావుడిగా బ్యాంకులోకి దూసుకొచ్చాడు.చేతిలో ట్రావెల్ బ్యాగుతో కౌంటర్ దగ్గరికి వెళ్లి, నల్ల ప్లాస్టిక్ కవర్ తీసి, అది నిజమైన తుపాకీ అని బిల్డప్ ఇచ్చాడు.“మోకాళ్ల మీద కూర్చోండి” అని గట్టిగా అరిచాడు.ఒక్కసారిగా బ్యాంకులో భయానక వాతావరణం నెలకొంది.కొంతమంది కస్టమర్లు, సిబ్బంది భయంతో కేకలు వేశారు.దొంగ మెయిన్ డోర్ దగ్గర నిలబడి ఎవరినీ లోపలికి రాకుండా అడ్డుకున్నాడు.కౌంటర్ దగ్గరికి వెళ్లి తన ట్రావెల్ బ్యాగు నిండా 50,000 వోన్ నోట్లు (దాదాపు రూ.3000) నింపమని డిమాండ్ చేశాడు.

అయితే, దొంగ ప్లాన్ ఎక్కువసేపు నిలవలేదు. పార్క్ చెయోన్ గ్యు ( Park Cheon Gyu )అనే 53 ఏళ్ల మాజీ సైనికుడు రియల్ హీరోలా ఎంట్రీ ఇచ్చాడు.క్షణం కూడా ఆలోచించకుండా దొంగని వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు.
వెంటనే బ్యాంకు సిబ్బంది కూడా అతనికి సాయం చేయడంతో దొంగ కిందపడిపోయాడు.పోలీసులు వచ్చి నిమిషాల్లోనే అతన్ని అరెస్ట్ చేశారు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే వెలుగు చూసింది.దొంగ దగ్గర ఉన్న బ్యాగుని చెక్ చేయగా.
అందులో కనిపించింది చూసి పోలీసులు షాకయ్యారు.అది నిజమైన గన్ కాదు.పిల్లలు ఆడుకునే డైనోసార్ బొమ్మ తుపాకీ ( Dinosaur toy gun )అని తేలింది.“అది బొమ్మ తుపాకీ అని తెలిసినా, ఆ టైమ్‌లో అందరూ చాలా భయపడ్డారు” అని బ్యాంక్ అధికారి ఒకరు నవ్వేస్తూ చెప్పారు.

ఇక అసలు హీరో పార్క్ చెయోన్ గ్యు గురించి చెప్పాలి.ఆయన తన భార్యతో కలిసి బ్యాంకుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.“దొంగ అరుస్తూ బ్యాగు పట్టుకుని ఉండటం చూసి, వెంటనే అతన్ని ఆపాలని డిసైడ్ అయ్యాను.నేనే ఆపగలననిపించింది.నా భార్య మాత్రం ఈ పుట్టినరోజును ఎప్పటికీ మర్చిపోలేను అంటోంది.” అని పార్క్ చెప్పారు.పోలీసుల విచారణలో దొంగ గత ఐదేళ్లుగా ఉద్యోగం లేకుండా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడని తేలింది.అందుకే ఇలా వెర్రి పని చేశాడని తెలుస్తోంది.దోపిడీకి సరైన ప్లాన్ లేదు, పారిపోవడానికి వెహికల్ లేదు, కనీసం వాడింది బొమ్మ తుపాకీ.ఈ వార్త చైనా సోషల్ మీడియాలో వైరల్ అయింది.నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తించారు.“జైలుకెళ్తే దొంగ ఆర్థిక సమస్యలు తీరినట్టే” అని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు “ఇంత కామెడీ స్టోరీని ఏ రచయిత కూడా రాయలేరు” అని నవ్వేశారు.







