తెలుగు సూపర్ హిట్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో మురారి సినిమా కచ్చితంగా ఉంటుంది.తెలుగు సినిమా పరిశ్రమలో ఈ సినిమా ఓ సూపర్ డూపర్ హిట్ కొట్టింది.
మహేష్ బాబు, సోనాలీ బింద్రే హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.అయితే ఈ సినిమా కథ ఎక్కడి నుంచో పుట్టి మరెక్కడికో వెళ్లింది.
ఇంతకీ ఈ సినిమా కథ ఎలా రూపుదిద్దుకుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తమిళనాడు పర్యటనకు వెళ్లి.
అక్కడే హత్యకు గురయ్యారు దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ.ఆ హత్యలో నుంచి పుట్టిన స్టోరీనే మురారి.
ఈ సినిమా స్టోరీకి, ఆయన హత్యకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను.ఓ సారి దర్శకుడు కృష్ణవంశీ తన ఫ్రెండ్స్ తో కలిసి లాంచీ జర్నీ చేస్తున్నాడు.
ఈ సందర్భంగా వారి మధ్య రాజీవ్ గాంధీ మర్డర్ అంశం చర్చకు వచ్చింది.వారి కుటుంబంలో ఇప్పటికే చాలా మంది చనిపోయినట్లు చెప్పుకున్నారు.వారి కటుంబానికి శాపం ఉండటం మూలంగానే వరుస హత్యలు జరుగుతున్నాయని అనుకున్నారు.
అప్పుడే దర్శకుడి మైండ్ లో ఓ కథ వెలుగు వెలిగింది.శాపంతో కూడిన కుటుంబంపై సినిమా తీయాలి అనుకున్నాడు.అదే మురారీ అయ్యింది.
మొత్తంగా ఈ సినిమా స్టోరీని రాశాడు కృష్ణవంశీ.మహేష్ బాబు హీరోగా ఈ సినిమా చేస్తే బాగుటుంది అనుకున్నాడు.వెంటనే ఈ స్టోరీని ఆయన తండ్రి కృష్ణకు చెప్పాలనుకున్నాడు.ఓ రోజు పద్మాలయ ఆఫీస్లో కృష్ణ, మహేశ్ బాబుకు కృష్ణ వంశీ ఆ కథను వివరించాడు.
స్టోరీ వారికి బాగా నచ్చింది.భాగవతం, భారతంలోని క్యారెక్టర్లను ఈ సినిమా క్యారెక్టర్లుగా రూపొందించాడు కృష్ణ వంశీ .అనంతరం ఈ కథను సిరివెన్నెల సీతారామ శాస్త్రికి చూపించాడు.ఆయన కొన్ని మార్పలు చేశాడు.
ఫైనల్ స్క్రిప్ట్ ను కృష్ణకు చూపించాడు కృష్ణ వంశీ.ప్రొసీడ్ అని చెప్పాడు కృష్ణ.తక్కువ సమయంలోనే ఈ సినిమా పూర్తయ్యింది.2001, ఫిబ్రవరి 17న విడుదలైంది.ప్రిన్స్ సినిమా కెరీర్ లోనే స్పెషల్ మూవీ అయ్యింది.