ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే ముత్యాల్లాంటి మెరిసే దంతాలు మీ సొంతం అవుతాయి!

దంతాలు ముత్యాల మాదిరి తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తే ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.ముత్యాల్లాంటి దంతాలు నవ్వుకు మరింత అందాన్ని తెస్తాయి.

 Follow This Simple Tip To Get Whiter Teeth! Simple Tip, Teeth, Teeth Whitening,-TeluguStop.com

అందుకే దంతాలను తెల్లగా మెరిపించుకోవడం కోసం ఖరీదైన టూత్ పేస్ట్ ను వాడుతుంటారు.అయితే ఎంత ఖరీదైన టూత్ పేస్ట్ ను వాడినప్పటికీ కొందరి దంతాలు పసుపు రంగులో గార పట్టి ఉంటాయి.

ఇలాంటి వారు ఇతరులతో మాట్లాడడానికి ఎంతగానో సంకోచిస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే ముత్యాల్లాంటి మెరిసే దంతాలు మీ సొంతమవుతాయి.

మరి ఇంతకీ ఆ సింపుల్ చిట్కా ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్ ను వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి, వన్ టేబుల్ స్పూన్ లవంగాల పొడి, ఆఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.ప్రతిరోజు ఈ పొడిని కొంచెం కొంచెం గా తీసుకుని వాటర్ తో మిక్స్ చేసి దంతాలను తోముకోవాలి.ఈ పొడితో కనీసం రెండు నిమిషాల పాటు దంతాలు తోముకుని.

ఆపై వాటర్ తో శుభ్రంగా దంతాల‌ను మ‌రియు నోటిని క్లీన్‌ చేసుకోవాలి.ప్రతిరోజు ఈ విధంగా చేస్తే పసుపు రంగులోకి మారిన దంతాలు కేవలం కొద్ది రోజుల్లోనే తెల్లగా ముత్యాల్లా మెరుస్తాయి.

అలాగే ఈ సింపుల్ చిట్కాను పాటించడం వల్ల దంతాలు దృఢంగా మారతాయి.చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తస్రావం తదితర సమస్యలు దూరం అవుతాయి.

కాబట్టి తెల్లని మెరిసేటి దంతాలు కావాలని కోరుకునే వారు తప్పకుండా ఈ సింపుల్ చిట్కాను అలవాటు చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube