మెంతుల నీరు త్రాగుతున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసమే..

మన ఇంట్లో ఉన్న వంటింట్లో ఉప్పు, పప్పులతో పాటు మెంతులు కూడా సాధారణంగా ఉంటాయి.కానీ వీటిని వాడడమే తక్కువగా ఉంటుంది.

 Are You Drinking Fenugreek Water But These Things Are For You ,drinking Fenugree-TeluguStop.com

అసలు మీరు మెంతులతో ఏం చేస్తారు అంటే చాలామంది గర్భిణీలు టిఫిన్ పిండి గ్రైండ్ చేసేటప్పుడు పచ్చళ్లలో వాడుతూ ఉంటాం అని చెబుతూ ఉంటారు.కొందరు అది కూడా చేయరు.

కానీ మెంతులతో మీకు తెలియని ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి.వీటి వల్ల వచ్చే లాభాలు తెలిస్తే ఎక్కడో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెంతులు స్థాయి మొదటి స్థానంలోకి వస్తుంది.

మెంతులతో తయారుచేసుకొని నీటిని తాగడం వల్ల మనలో చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

Telugu Problem, Fenugreek, Problems, Tips, Kidney Problems-Telugu Health

ఒక పాత్రలో రెండు గ్లాసుల నీటిని తీసుకొని అందులో ఒక స్పూన్ మెంతులను వేసి బాగా మరిగించాలి.మెంతుల రంగు పూర్తిగా మారి నీరు ఆ రంగులోకి వచ్చాక ఆ మిశ్రమాన్ని స్వీకరించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.దీనివల్ల మలబద్దకం సమస్య దూరం అవుతుంది.

మెంతులతో తయారు చేసుకునే ఆ నీటిని తాగడం వల్ల రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ సాయి తగ్గుతుంది.కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఇలా చేయడం ఇంకా మంచిది.

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మెంతులు దివ్య ఔషధం అనే చెప్పాలి.కాబట్టి ఈ నీటిని తాగితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

గుండె, ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉండేందుకు మెంతుల నీటిని వారంలో కనీసం మూడు నుంచి నాలుగు సార్లు తాగడం మంచిది.

Telugu Problem, Fenugreek, Problems, Tips, Kidney Problems-Telugu Health

రాత్రి నానబెట్టిన మెంతులను ఉదయాన్నే ఆ నీటిని తాగేసి మెంతులను తినేయవచ్చు.లేకుంటే నానబెట్టిన మెంతులను అలాగే వదిలేసిన సాయంత్రానికి మొలకలు వస్తాయి.అవి ఇంకా రుచిగా ఉంటాయి.

అసలు చేదు అనిపించవు.అలా ఆయన మొలకలను తినవచ్చు.

మెంతులతో ప్రతిరోజు ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube